Fake currency | cash for vote | Chandrababu | Revanth Reddy

Telanagana income tax officers identify fake currency in the cash for vote case

Fake currency, fake notes, cash for vote, Chandrababu, Revanth Reddy

Telanagana Income tax officers identify fake currency in the cash for vote case. Income tax officers found fake notes in the bag, which Revanth Reddy to deliver to stephenson.

ఓటుకు నోటులో దొంగ నోట్లు

Posted: 06/18/2015 12:37 PM IST
Telanagana income tax officers identify fake currency in the cash for vote case

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటుకు నోటు వ్యవహారం సీరియల్స్ లాగా సాగుతోంది. ట్విస్టు మీద ట్విస్టులతో ఓటుకు నోటు వ్యవహారం కాస్త రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రేవంత్ రెడ్డి స్టీపెన్ సన్ కు ముట్టజెప్పాలనుకున్న యాభై లక్షల నగదులో కొన్ని దొంగ నోట్లు ఉన్నట్లు తాజాగా అధికారులు గుర్తించారట. అవును మీరు చదువుతోంది నిజమే. దొంగ నోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారట. అందుకే ఈ దొంగ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయో అన్న కోణంలో తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చెయ్యాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

ఓటుకు కోట్లు కేసులో స్వాధీనం చేసుకున్న నగదులో దొంగ నోట్లు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని నోట్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించిన సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై సీరియస్ గా విచారణ చేపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు చెల్లిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ ఆ డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది. అందులో కొన్ని దొంగ నోట్లు ఉన్నట్టు తేలిందని తెలిసింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? ఐటీ లెక్కలున్నాయా? వంటి వివరాలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేస్తోంది.ఈ కేసు విచారణలో ఆ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేశారా? లేక ఎవరైనా పారిశ్రామిక వేత్త నుంచి తెచ్చారా? అన్న విషయంపై ఆరా తీసిన తర్వాత ఏసీబీ ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలిపే అవకాశాలున్నాయి. అయితే వాటిని లెక్కించిన అధికారులు అందులో దొంగనోట్లు ఉన్నాయని తెలియడంతో ఇప్పు డు దానిపైనా దృష్టి సారించినట్టు అధికారవర్గాల సమాచారం. కాగా గతంలో ఏపీ సీఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఒకరు దొంగ నోట్ల కేసులో పట్టుబడిన ఉదంతం నేపథ్యంలో వ్యవహారం ఎటు తిరుగుతుందో అనే చర్చ సాగుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake currency  fake notes  cash for vote  Chandrababu  Revanth Reddy  

Other Articles