Cash for vote scam keeps KCR, Chandrababu Naidu on their toes

Cash for vote scam acb to issue notices to chandrababu

cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh crime investigation department, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

The Anti-Corruption Bureau has a plan of action in place if Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and cash-for-vote accused A. Revanth Reddy refuse to give voice test samples.

ITEMVIDEOS: ఓటుకు నోటు కేసులో.. శరవేగంగా మారుతున్న పరిణామాలు

Posted: 06/16/2015 03:17 PM IST
Cash for vote scam acb to issue notices to chandrababu

ఓటుకు కోట్లు వ్యవహారంలో పరిణామాలు ఇవాళ ఉదయం నుంచి శరవేగంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంపై తన దర్యాప్తును వేగవంతం చేసిన తెలంగాణ ఏసీబీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి  ఉన్నత స్థాయి నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. చట్టప్రకారం అన్ని చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గవర్నర్ తో సమావేశం అయ్యారని సమాచారం మరోవైపు ఆయన వాయిస్ శాంపిల్స్ ను కూడా రికార్డు చేసేందుకు ఏసీబి అధికారులు సిద్దమవుతున్నారు. అయితే సమైక్య రాష్ట్ర అసెంబ్లీలోని టేపులతో ఆయన వాయిస్ ను శాంపిల్ గా స్వీకరించి.. వాటితో ఫోన్ సంభాషణల వాయిస్ ను సరిపోల్చుకోవాలని ఏసిబి అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని సరిగ్గా అవే వ్యాఖ్యలు ఆయనతో చెప్పించాలని మరికోందరు సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలసింది.

కాగా, చంద్రబాబు పాత వాయిస్ శాంపిల్స్ తో పాటు ఫోన్ సంభాషణల శాంపిల్స్ ను సేకరించిన ఏసీబి వాటిని నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ కు పంపించిందని, అ రెండు వాయిస్ లు ఒకరివేనా.. లేక వేర్వేరు వ్యక్తులవా అని తేల్చే పనిలో సంబంధిత అధికారులు వున్నారు. దీంతో నాంపల్లిలోని ఎఫ్ ఎస్ ఎల్ వద్ద తెలంగాణ ప్రభుత్వం కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ల్యాబ్ అవరణను మొత్తంగా తమ పహారాను ఏర్పాటు చేసిన పోలీసులు ల్యాబ్ లోకి అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించడం లేదు.  

కాగా  అటు ఆంద్రప్రదే్శ్ ప్రభుత్వం కూడా దీనిపై అదేస్థాయిలో రియాక్ట్ అవుతుంది. తమకు అందుబాటులో వున్న మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ డిజీ సహా పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గోన్నారు. ముత్తయ్య పిర్యాదును సిఐడి డిజి ద్వారకా తిరుమల రావు నేతృత్వంలో దర్యాప్తు చేయనున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ అద్యక్షుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నోటీసులు జారీ చేసిన క్రమంలో అటు కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేయాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తుందని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anti-Corruption Bureau  chandrababu  Governer  cash-for-vote scam  KCR  horse riding  

Other Articles