fingers | cut | love | male | women | Indonesia

When a loved one dies this indonesian tribe amputates a womans finger

fingers, cut, love, male, women, Indonesia, Tribals, Daani tribal

When a loved one dies, this Indonesian tribe amputates a womans finger. Though death is integral it is also crippling, and often the death of a loved one leaves us with an aggressive emotional void, leaving us nearly physically incapacitated.

మగాడు చనిపోతే ఆగవాళ్ల వేళ్లు కట్

Posted: 06/16/2015 01:22 PM IST
When a loved one dies this indonesian tribe amputates a womans finger

అవును.. మీరు చదివింది. నిజం. అక్కడ మగాళ్లు చనిపోయారు అంటే వారికి సంబందించిన వారికి వేళ్లు పోతాయని అర్థం. ఇండోనేషియాలోనొ ఓ తెగలో పురుషుడెవరన్నా చనిపోయాడంటే స్త్రీలకు నరకం కనిపించాల్సిందే. వినడానికే ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఆచారం గతంలో అంతలా కాకపోయినా ఇప్పటికీ ఈ తెగలో అక్కడక్కడా కనిపిస్తుంది. 'దాని' తెగలో కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ చనిపోతే స్త్రీల వేళ్ళలో ఒక దాన్ని నరికివేస్తారు. బంధువు చనిపోయాడనే మానసిక బాధ ఒకవైపు, తన వేలు తెగిపోయినందువల్ల కలిగే భౌతికమైన నొప్పి మరొకవైపు ఆ తెగ స్త్రీమూర్తులను నరకయాతనకు గురిచేస్తుంది. వేలు మొత్తాన్ని నరకరు కానీ కొంత భాగాన్ని ఇలా నరుకుతారు.

ఇదేదో స్త్రీలు ఇష్ట ప్రకారం నరికించుకునే తంతు కాదు. వారికి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా వేలును నరికివేస్తారు. నరకబోయే ముందు వేలుకు ఒక దారాన్ని గట్టిగా చుట్టి రక్తప్రసరణ కాకుండా అరగంట ఉంచుతారు. ఆ తరువాత రక్తప్రసరణ కాని వేలు భాగాన్ని నరికేస్తారు. రక్త ప్రసరణ కాదు కాబట్టి వేలు మొద్దుబారి నరికేటప్పుడు ఎక్కువగా నొప్పి ఉండదని భావిస్తారు. కానీ వేలు కోల్పోయే స్త్రీలకే తెలుస్తుంది ఆ బాధ. నరికిన వేలు చివర కాలుస్తారు. ఇలా కాలిస్తే కొత్త స్కార్‌ టిస్యూలు పుడతాయని అంటారు. ఒక ఇంట్లో బతికి ఉన్న స్త్రీ ఎన్ని వేళ్ళు పొగొట్టుకుంటే ఆ ఇంట్లో అంతమంది పురుషులు చనిపోయినట్లు లెక్క. ఇలా నరకడం వలన చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయని వారి నమ్మకం. అయినా గతంలో సతీసహగమనం గురించి విన్నాం కానీ ఇలా ఇంట్లో మగాడు చనిపోతే వేళ్లు నరికివెయ్యడం ఏంటో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fingers  cut  love  male  women  Indonesia  Tribals  Daani tribal  

Other Articles