cash for vote | TDP | Revanth Reddy | ACB | Telangana | AP

Telugudesamparty leaders seriously discussiong about the cash for vote case

cash for vote, TDP, Revanth Reddy, ACB, Telangana, AP

Telugudesamparty leaders seriously discussiong about the cash for vote case. TDP leaders identify some loop holes in the note for cash case.

రేవంత్ రెడ్డి కేసులో లొసుగులు.. ఏసీబీ తప్పుందా..?

Posted: 06/16/2015 09:33 AM IST
Telugudesamparty leaders seriously discussiong about the cash for vote case

తెలంగాణ ఏసీబీ అధికారుల దూకుడుతో ఏపి సర్కార్ కుదేలవుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓటుకు నోటు వ్యవహారంలో వేలుపెట్టారని ఏసీబీ ప్రాథమికంగా నిర్దారణకు వచ్చింది. అందుకు సంబందించిన ఆడియో టేపులు ఏసీబీ వాదనకు గట్టి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే తెలంగాణ ఏసీబీ అధికారుల దూకుడుకు కళ్లెం వేసిది ఎలా అని ఏపి ఉన్నతాధికారులు తెగ ఆలోచిస్తున్నారట. అయితే రేవంత్ రెడ్డి మీద పెట్టిన కేసులో ఉన్న లొసుగులను బయటకు తీయడం ద్వారా కేసును నీరుగార్చొచ్చని.. అందుకు గల అవకాశాలపై తర్జన భర్జన పడుతున్నారట. అయితే ఈ కేసులో తమకు గత అవకాశాల మీద తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఓ రిటైడ్ జడ్జితో చర్చించారట. అయితే ఆయన సూచన మేరకు రేవంత్ కేసులో ఉన్న తప్పులను ఎత్తిచూపాలని నిర్ణయించారు.

రేవంత్ పై పెట్టిన కేసులో లొసుగులు ఉన్నట్లు భావిస్తున్న పాయింట్స్..
* ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు సీఆర్‌పీసీ సెక్షన్ 154, 157 నిబంధనలను పాటించకుండానే పోలీసులు సాక్ష్యాలను సేకరించారన్నది స్పష్టమైందంటున్నారు.
* మే 31 రిమాండ్ నివేదిక ప్రకారం... ఫిర్యాదుదారుడు, నిందితుల మధ్య జరిగే సంభాషణల రికార్డింగ్‌కు ఏసీబీ డీఎస్పీ ఆడియో, వీడియో సరంజామాతో మాల్కం టేలర్ ఇంటికి వెళ్లారు. అప్పటికి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.. న్యాయస్థానానికి సమాచారమూ ఇవ్వలేదు.
* ఆ సమయానికి ఫిర్యాదుదారుడు, నిందితుల మధ్య సమావేశం ఉన్నట్లు డీఎస్పీకి ఎలా తెలిసింది?.. పోలీసు రికార్డులో దానికి సంబంధించిన వివరాలేమీ లేవు.
* ఫిర్యాదు కాపీని డీఎస్పీ మే 28న ఏసీబీ డీజీ నుంచి అందుకున్నారు. డీఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లడానికి ముందు... డీజీ నిర్దేశాల ప్రకారం సదరు ఫిర్యాదులోని నిజానిజాల నిర్ధారణకు ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించారన్న వివరాలూ పోలీసురికార్డుల్లో లేవు.
* ఎవరి ఆదేశాలతో మే 31న రికార్డింగ్‌కు అవసరమైన ఆడియో, వీడియో సామాగ్రి, పోలీసు బృందంతో డీఎస్పీ ఆ ఇంటికి వెళ్లారు?
* సంఘటన రోజున.. ఆ సమయానికి నిందితుడు నగదు ఇవ్వడానికి మాల్కం టేలర్ ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు ఎలా సమాచారం అందిందో రిమాండ్ నివేదికలో చెప్పలేదు.
* వల వేయడానికి ముందే ఫిర్యాదుదారుని ప్రశ్నించారా..? ఒకవేళ ప్రశ్నిస్తే ఆయన ఏమని వాంగ్మూలమిచ్చారు?.. కోర్టుకు సమర్పించిన పోలీసు రికార్డుల్లో ఈ ప్రస్తావనే లేదు.

దీంతో ఫిర్యాదుదారుడైన ప్టీఫెస్ సన్ ను ప్రశ్నించకుండా, నిబంధనలు అనుసరించకుండా, న్యాయస్థానం అనుమతి తీసుకోకుండా డీఎస్పీయే వలవేసి..రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు జరిగిన పరిణామాలు సూచిస్తున్నాయి.ఈ విశ్లేషణ ప్రకారం ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని.. నిందితుడిని అరెస్ట్ చేయడానికి ఏసీబీ డీఎస్పీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తెదేపా వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ వాదనలో ఎంత వరకు బలం ఉందో తెలియాలంటే కాస్త ఓపికపట్టాలి.
(Source:Eendau)

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash for vote  TDP  Revanth Reddy  ACB  Telangana  AP  

Other Articles