phone signals and tower location of chandrababu phone conversation traced.

Chandrababu phone conversation with stephenson traced

phone signals and tower location of chandrababu phone conversation traced, AP chief minister chandrababu, phone conversation, Revanth reddy, mla stphenson, phone signals, tower location, jubliee hill, road number 24, Telangana TDP, cash for vote, note fo vote, Telangana government, ACB officials

phone signals and tower location of AP chief minister chandrababu phone conversation with mla stphenson traced.

ఆ ‘సిగ్నళ్లు’. చంద్రబాబు వీధి నుంచే.. ట్రేస్ చేసిన ఏసీబి

Posted: 06/13/2015 03:04 PM IST
Chandrababu phone conversation with stephenson traced

ఓటుకు నోటు కేసును పకడ్భంధీగా ధర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసిబీ అధికారులు.. అందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్ లో సంబాషించారన్న అభియోగాల నేపథ్యంలో.. ఆ దిశగా కూడా ఏసిబి అధికారులు సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫోన్ సంభాషణలు జరిపింది తమ అధినేత కాదంటూ.. ఈ టేపులు వెలుగుచూసిన రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో వెలువరించడంతో.. ఆ సంబాషణలు చంద్రబాబువే అనేందుకు తగిన సాక్ష్యాధారాలను వారు సేకరించే పనిలో పడ్డారు. ఇందుకు గాను ఎమ్మెల్యే ష్టీఫెన్ సన్ కు వచ్చిన సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంతో పాటు టవర్ లోకేషన్ ను అధికారులు పట్టేశారు.

ఈ కేసులో కీలక నిందితుడు, రెడ్ హ్యాండెడ్ గా దోరికిన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి బాస్ తో జరపిన ఫోన్ సంబషణలు, సదరు బాస్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంబాషణల టవర్ టోకేషన్ ఒకటేనని ఏసీబి అధికారులు తేల్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 24 నుంచే సిగ్నల్స్ వెళ్లాయని అధికారులు తేల్చారు. కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబి అధికారులు సిగ్నల్స్ చంద్రబాబు నివాసం నుంచే వెళ్లాయన్న సాక్ష్యాలను సేకరించిన క్రమంలో.. టీడీపీ నుంచి టీఆర్ఎష్ లోకి చేరిన ఎమ్మెల్యేలు, నేతలు ఇప్పటికే ఆ గొంతు చంద్రబాబుదేనని వాదిస్తున్న నేపథ్యంలో వారి వాదనలకు మరింత బలం చేకూరింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  phone conversation  Revanth reddy  mla stphenson  phone signals  tower location  

Other Articles