Accident | Dhawaleshwaram | 22died | Vijayawada | Toofan

Major accident at dhawaleshwaram barrage

Accident, Dhawaleshwaram, 22died, Vijayawada, Toofan

Major Accident at Dhawaleshwaram barrage. In this major accident 22 members died and two more children injured.

ITEMVIDEOS:ధవళేశ్వరం వద్ద ఘోర ప్రమాదం.. 22 మంది మృతి

Posted: 06/13/2015 07:38 AM IST
Major accident at dhawaleshwaram barrage

ఏపిలొ ఈ ఉదయం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకొని తిరురు ప్రయాణంలో ఉన్న తూఫాన్ వాహనం అదుపు తప్పింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో పడటంతో 21 మంది మృతి చెందారు. అందులో తొమ్మిది మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన వారు తూఫాన్  వాహనం అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి నదిలో పడటంతో నుజ్జునుజ్జయిందిది. తూఫాన్ చాలా వేగంగా నడపడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే వెనకి నుండి ఏదైనా వాహనం ఢీ కొట్టిందా..? అనుమానాలు కూడాకలుగుతున్నాయి. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టారు. డ్రైవర్ బహుశా నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని అక్కడి వారు అనుకుంటున్నారు. ప్రమాదం  జరిగిన వెంటనే రూరల్ ఎస్పీ, కలెక్టర్ లు ప్రమాదం మీద ఆరా తీశారు. స్థానిక మంత్రి చినరాజప్ప ఘటనపై విచారణకు ఆదేశించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ల సహాయంతో వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదం నుంచి ఒక పాప, ఒక బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతానికి పాప షాక్‌లో ఉన్నట్లు సమాచారం.

 

01
02
03

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles