రేవంత్ రెడ్డి అరెస్టుతో ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తారా స్థాయికి చేరుకుంది. అయితే ఇదంతా తెలంగాణ సర్కార్ చేస్తున్న కుట్ర అని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి అంశంతో ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలు మరింతగా పెరిగాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని వాదన. అయిత తెలంగాణ సర్కార్ మాత్రం మరోలా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చెయ్యడం లేదని.. కేవలం స్టీఫెన్ సన్ చేసిన ఫిర్యాదు మేరకే నిఘా ఉంచామని తెలిపారు. అలా నిఘా ఉంచిన తర్వాత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారని, అందులో భాగంగా చంద్రబాబు మాట్లాడిన విషయాలు కూడా బయటకు వచ్చాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే ఏసీబీ అధికారులు చెబుతున్న మ్యాటర్ లో ఓ లాజిక్ ను బాగా క్యాచ్ చేశారు రేవంత్ రెడ్డి తరఫు లాయర్లు. అదేంటంటే..
స్టీఫెన్ సన్ గత నెల 28న ఫిర్యాదు చేశారు. కానీ ఏసీబీ వాళ్లు మాత్రం 31న కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదు అందిన మూడు రోజుల పాటు ఆడియో, వీడియో రికార్డింగ్ ఎ:దుకు చేశారని రేవంత్ రెడ్డి తరపు లాయర్లు ప్రశ్నించారు. కేసు నమోదు చేయకుండా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయడం చట్టవిరుద్దమని కూడా వారు అంటున్నారు. కేసు నమోదు చేయకుండానే దర్యాప్తు ఎలా చేస్తారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా 28న అందిన ఫిర్యాదుపై 31న కేసు నమోదు చేశామని చెబుతున్న ఏసీబీ వాదనలో కుట్ర కోణం దాగుందని రేవంత్ తరఫు లాయర్లు కోర్టుకు వెల్లడించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more