Senior Lawyer Ram Jethmalani Announces 'Break-Up' With PM Modi

Ram jethmalani announces his breakup with narendra modi on twitter

Noted lawyer Ram Jethmalani, break up, Prime Minister Narendra Modi, diminishing respect ended, , PM Modi, Twitter, social media, ram jetmalani letterto modi on breakup

My diminishing respect for you ends now," senior advocate Ram Jethmalani told Prime Minister Narendra Modi in a letter released on Twitter

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. తేల్చిచెప్పిన సీనియర్ నాయకుడు

Posted: 06/09/2015 10:09 PM IST
Ram jethmalani announces his breakup with narendra modi on twitter

బీజేపి పార్టీ కురువృద్దులను కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంతో పాటు ఆ పార్టీ కూడా పక్కన పెడుతుందన్న విమర్శలకు బలం చేకూరింది. బిజేపిని తమ భుజస్కంధాలపై మోసిన సీనియర్ నేతల్లో ఒకరైన ప్రముఖ్య నాయాయవాధి రాం జఠ్మాలనీ ఈ విషయంలో మనస్తాపం చెందారు. ఎంతలా అంటే ఏకంగా తన అసంతృప్తిపై ఏకంగా సామాజిక మాధ్యంమం ట్విట్టర్ లో అక్కస్సును వెళ్లగక్కుతూ.. ఇకపై ప్రధాని తో మాట్లల్లేవ్, మాట్లాడుతకోవడాల్ లేవ్ అని పెర్కోంటూ ఒక లేఖను పెట్టారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న బంధాన్నిఇకపై  తెంచుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇందుకు ఆయన మరో కారణాన్ని కూడా పేర్కోన్నారు. కీలకమైన విజిలెన్స్ శాఖలో అవినీతి చరిత్ర  ఉన్న కేవీ చౌదరిని సీవీసీగా (చీఫ్ విజిలెన్స్ కమిషనర్) నియమించడంతో ప్రభుత్వం మీద తనకున్న గౌరవం పోయిందని ఆయన తెలిపారు.  కేవీ చౌదరి  పరపతి  ఏమంత గొప్పగా లేదని, ఆయన మీద అనేక ఆరోపణలున్నాయని  రాం జెఠ్మలానీ అంటున్నారు. ఈ నియామకానికి వ్యతిరేకంగా  సుప్రీంకోర్టులో తాను పోరాడనున్నానని తెలిపారు. దీనికి సంబంధించి  సోమవారం  సోషల్  మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లో  మోదీకి ఒక సందేశాన్ని పంపారు.  మోదీతో తనకున్న సంబంధాలను తెంచుకున్నట్టుగా ఒక  ఉత్తరాన్ని పోస్ట్ చేశారు.

బీజేపీలో  సీనియర్ నేతలంతా మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో మోదీని చాలా గట్టిగా సమర్ధించిన జెఠ్మలానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఈ తాజా పరిణామంతో  ఇప్పటికే కేవీ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న మరో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది, ఆప్ బహిష్కృత నేత ప్రశాంత్ భూషణ్ కు, రాజ్యసభ మాజీసభ్యుడు జెఠ్మలానీ మద్దతు  లభించినట్టయింది. కాగా  కేవీ చౌదరి నియామకాన్ని ఖండించిన  ప్రశాంత్ భూషణ్... ఈ అంశంపై ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఇప్పటికే లేఖ రాశారు. ఇది అవమానకర, దురదృష్టకర ఘటన అని , దీనికి వ్యతిరేకంగా  సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ప్రకటించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Jethmalani  breakup  Narendra Modi  Twitter  

Other Articles