Revanth Reddy, ACB, Telangana, Ride

On note for vote scandal acb oficers ride on revanth reddy house

Revanth Reddy, ACB, Telangana, Ride

On Note for vote scandal ACB oficers ride on Revanth Reddy house. ACB Officers started their ride in this morning.

రేవంత్ ఇంట్లో ఏసీబీ సోదాలు

Posted: 06/09/2015 08:36 AM IST
On note for vote scandal acb oficers ride on revanth reddy house

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలకనేత రేవంత్ రెడ్డిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలను బట్టి కేసలో కీలక సమచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. అయితే రేపు కోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ హియరింగ్ కు ఉన్నందున ఏసీబీ తొందరగా కేసుపై నిజాలను నిగ్గుతేల్చాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఈ ఉదయం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు ప్రారంభించారు. అసలు యాభై లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి దగ్గరికి ఎలా వచ్చాయి..? ఎవరు ఇచ్చారు..? దానికి సంబందించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా.? లాంటి విషయాలను ఆరా తీస్తున్నారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో ఏసీబీ శాఖ అధికారులు సోదాలు ప్రారంభించారు. విడివిడిగా ఈ ముగ్గురిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు తాజాగా ఇళ్లలో సోదాలు చేస్తే కీలక సమాచారం దొరుకుతుందని ముందుకు సాగుతున్నారు. మరి ఓటుకు నోటుకు వ్యవహారంలో ఏసీబీ అధికారులు అనుకుంటున్నట్లుగా ఏమైనా సమాచారం లభిస్తుందో లేదో మరికొద్దిసేపట్లో తేలుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  ACB  Telangana  Ride  

Other Articles