TDP president chandrababu naidu audio tapes with mla stephen

Ap cm chandrababu phone call audio tape with stephen

TDP president chandrababu naidu, andhra pradesh chief minister chandrababu, audio tapes, nominated mla stephen, tdp mla revanth reddy, TRS mla stephen, Telangana government, KCR, Telangana CM kcr, anti corruption bureau, ACB, Telangana ACB, cash for vote case, mlc elections

TDP president and andhra pradesh chief minister chandrababu naidu audio tapes with mla stephen released

ITEMVIDEOS: వెలుగు చూసిన చీకటి ‘చంద్రుడి’ ఫోన్ సంబాషణ.. అది నిజమేనా..?

Posted: 06/07/2015 10:57 PM IST
Ap cm chandrababu phone call audio tape with stephen

తెలంగాణ శాసనసభ కోటాలో నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చీకటి వ్యవహారం వెలుగుచూసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు తాజాగా బహిర్గతం అయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని తాను తప్పకుండా నెరవేరుస్తానని స్టీఫెన్సన్ కు చంద్రబాబు ఇచ్చిన హామీలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు చంద్రబాబుకు ఏ క్షణంలోనూనా నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఆయన సాగించిన ఫోన్ సంభాషణ టేపులు బహిర్గతం కావడంతో.. ఇక తెలంగాణ ప్రభుత్వం, ఏసీబి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్, వైఎస్సార్ సిపీ నేతలు చంద్రబాబు.. తక్షణం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు, టీడీపీ పార్టీ నేతలు ఎలా స్పందించనున్నారో వేచి చూడాలి.
 
స్టీఫెన్సన్ తో చంద్రబాబు సంభాషణ ఈ విధంగా సాగింది..
 

చంద్రబాబు తరపు మనిషి:హలో బ్రదర్.. బాబుగారు మీతో మాట్లాడతారు.. లైన్ లో ఉండండి
ఎమ్మెల్యే స్టీఫెన్సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్
చంద్రబాబు:గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ
స్టీఫెన్సన్: ఫైన్.. థాంక్యూ సర్
చంద్రబాబు:మనవాళ్లు నాకంతా వివరించారు.. మీకు అండగా నేనుంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు
స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు:అన్నింటికీ మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం
స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు:మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు
స్టీఫెన్సన్:ఒకే సార్
చంద్రబాబు:అది మా హామీ.. మనం కలిసి పనిచేద్దాం
స్టీఫెన్సన్:రైట్.. థాంక్యూ సార్..
చంద్రబాబు:థాంక్యూ

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  phone call audio tape  mla stephen  

Other Articles