cash-for-vote scandal: talasani srinivas yadav slams chandrababu

Revanth reddy bribery case talasani srinivas yadav takes on tdp

TDP MLA Revanth reddy arrested in bribery case, cash-for-vote scandal, Telangana Mlc election, telangana mla revanth reddy arrested, anti corruption bureau officials, Rs. 50 lakh, nominated Mla stephen, Rs 5 crore, lalaguda, talasani srinivas yadav, kadiyam srihari, madavarm krishna rao, chandrababu naidu, TDP leaders

cash-for-vote scandal rocks differences in Telangana and andhra pradesh, minister talasani srinivas yadav says there is no need of phone tapping of TDP leaders to their government, TDP leaders bluff even after Ttdp mla revanth reddy caught red handedly by anti corruption bureau

ఫోన్ ట్యాప్‌ చేయాల్సిన ఖర్మ మాకు లేదు.. అది చంద్రబాబు ఆలోచన

Posted: 06/06/2015 07:08 PM IST
Revanth reddy bribery case talasani srinivas yadav takes on tdp

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అందరినీ రెచ్చగొడుతున్నారన్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎవరిని ఎవరు రెచ్చగొట్టినా చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. పోన్లను ట్యాప్‌ చేయాల్సిన ఖర్మ మాకు లేదని....చంద్రబాబు ఆలోచనలు తమపై రుద్దుతున్నారని తలసాని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఎవరూ తప్పు చేసినా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఓ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి బేరసారాలు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. కళ్లముందు వ్యక్తి పట్టుబడినా.. ఇంకా కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు.

రాజకీయాలల్లో డబ్బును సృష్టించింది చంద్రబాబే అనేది జగమెరిగిన సత్యం అన్నారు. టీడీపీలో 25 సంవత్సరాలుగా పోరాటం చేసింది తానేని మంత్రి తెలిపారు. నోటుకు ఓటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును వదమని తెలిపారు.చంద్రబాబు, రేవంత్‌ల విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిళ్లు, ప్రభావాలు పని చేస్తున్నాయంటూ కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాస్తున్నాయని.. అది వాస్తవం కాదని తెలిపారు. బాబుపై చట్ట పరిధిలో చర్య లు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి భయపడదని తేల్చి చెప్పారు.

ఈ కేసులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఇలా పట్టుబడి ఉంటే కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు సంబంధిత ఎమ్మెల్యే, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ గురించి పుంకాలు పుంకాలుగా చరిత్రలు రాసేవారు కాదా..? వారెందుకు ఇప్పుడు ఏమీ జరగనన్నట్టుగా.. ఈ ఓటుకు నోటు కేసు జరగనట్టుగా వ్యవహరిస్తున్నారని  ప్రశ్నించారు. జగన్‌ ప్రమేయం లేదని స్పష్టమైనా ఆయనను ముద్దాయిగా చేసేలా కథనాలు ప్రచురించేవారు కాదా..? అని తలసాని నిలదీశారు. నవ్యాంధ్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సమైక్య రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవని తప్పించుకోజూస్తున్నారని.. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు ప్రశ్నిస్తే ..సాధ్యమేనని చంద్రబాబు ఒప్పుకున్నారా..? లేదా..? ఆయనే చెప్పాలన్నారు. రేవంత్ విషయంలో మీడియాలో క్లిప్పిం గ్‌లు రానంత వరకు మీసాలు మేలేసి కుట్రలు, ట్రాప్ చేశారని ప్రగల్భాలు పలికారని.. టీవీల్లో వీడియోలు ప్రసారం కాగానే బాబుకు దిమ్మదిరిగి పోయిందని తలసాని మండిపడ్డారు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash-for-vote scandal  revanth reddy  talasani srinivas yadav  

Other Articles