Narachandrababu, Promises, ap, telangana, Naayini, YSRCP, YSjagan

Narachandrababu naidu said that he will go as the bullet

Narachandrababu, Promises, ap, telangana, Naayini, YSRCP, YSjagan

Narachandrababu naidu said that he will go as the bullet. chandrababu attacked on ysrcp and trs. He oppose the statements of Naayini.

చంద్రబాబు మాట మారింది

Posted: 06/04/2015 03:46 PM IST
Narachandrababu naidu said that he will go as the bullet

గత నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీకి తగులుతున్న దెబ్బల మీద, విమర్శల మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. ఆయనో చరిత్ర హీనుడని అన్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలకు తాను భయపడనని, బుల్లెట్ గా దూసుకువెళతానని చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణ హోంమంత్రి తనపై కేసులు పెడతామంటున్నారని, తనను బ్లాక్‌మెయిల్‌ చేయాలని చూస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జిల్లాలోని చేబ్రోలులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. టీటీడీపీ నేత రేవంత్‌ కేసులో బాబే సూత్రధారి అన్న తెలంగాణ హోంమంత్రి నాయిని వ్యాఖ్యలపై బాబు ఘాటుగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కేబినెట్‌లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందురోజు టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఇంట్లో ఉంచారని ఆరోపించారు. దమ్ముంటే ముందు మీ సీఎంపై కేసు పెట్టాలని నాయినికి సూచించారు.

మరో పక్క ఎన్నికల హామీల మీద చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సమైక్య రాష్ట్రం ఉండేదని, అప్పుడు తాను సమైక్య రాష్ట్రంలోనే హామీలు ఇచ్చానని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, ఆ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నింటినీ ఇప్పుడు నెరవేర్చడం కష్టమని ఆయన చెప్పారు. అప్పటి పరిస్థితలు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరే అంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు. మీరు నామీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతేనే చేయగలనని నమ్మి ఓట్లేశారు. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఆ రోజు చాలా హామీలు ఇచ్చాను. ప్ర.జలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై అప్పుడే విమర్శల వర్షం కురుస్తోంది. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందే అంటూ మండిపడుతున్నారు విపక్షపార్టీ నేతలు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Promises  ap  telangana  Naayini  YSRCP  YSjagan  

Other Articles