chandrababu naidu, ap, Revanth reddy, TDP, Sleep

Ap cm chandrababu not falling asleep

chandrababu naidu, ap, Revanth reddy, TDP, Sleep

Ap cm chandrababu Not falling asleep. Chandrababu naidu distrubed by Revanth Reddy issue, he told to near and dear.

పాపం చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు

Posted: 06/03/2015 11:06 AM IST
Ap cm chandrababu not falling asleep

టెన్షన్.. టెన్షన్.. తలనొప్పి.. ఏంటీ ఏదో జండూ బామ్ యాడ్ గురించి రాస్తున్నారు అనుకుంటున్నారేమో కాదు కాదు.. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి గురించి చెబుతున్నాం. గత మూడు రోజుల నుండి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిద్ర పట్టనివ్వడం లేదట. రేవంత్‌ రెడ్డి ఉదంతంపై ఏపీ సీఎం చంద్రబాబు కలత చెందుతున్నట్లు తెలిసింది. తాజా ఘటనలతో రెండు రోజులుగా నిద్రపట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. రేవంత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదాపడిన విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు నవనిర్మాణ దీక్ష సందర్భంగా కూడా చంద్రబాబు తన ప్రసంగంలో రేవంత్‌ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో మరిన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి.

chandrababu-naidu-social-me

అయితే రేవంత్ వ్యవహారంతో తీవ్రంగా కలత చెందారని, నిద్ర కూడా పట్టడం లేదని మీడియా వచ్చిన వార్తలపై అప్పుగే నెటిజన్లు పంచ్ లు కూడా వేస్తున్నారు. అయ్యో చంద్రాబాబు గుండెల్లో నిద్రపోతానన్న మీకే నిద్ర పట్టకపోతే ఇప్పటికే రెండు జైళ్లు మారిన రేవంత్ పరిస్థితి ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో పంచ్ లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అవకాశం దొరికితే చాలు నెటిజన్లు చంద్రబాబును మాత్రం ఎందుకు వదులుతారు చెప్పండి. మరి రేవంత్ రెడ్డి వల్ల నిద్ర పట్టకపోతే తాజాగా పీతల సుజాత ఒకవేళ ఉద్యోగాల కోసం పైరవీ చేశారని తెలిస్తే ఏమవుతారో..? అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap  Revanth reddy  TDP  Sleep  

Other Articles