Revanth reddy, stephensun, MLC, telanagana

Telanagana mlc elections brougth new two heros to media

Revanth reddy, stephensun, MLC, telanagana

Telanagana MLC elections brougth new two heros to media. On Yesterday revanth reddy arrested by acb officails.

ఎమ్మెల్సీ ఎన్నికల సినిమాలో జీరోలు లేరు.. ఇద్దరూ హీరోలే

Posted: 06/01/2015 01:14 PM IST
Telanagana mlc elections brougth new two heros to media

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న నానుడి చాలా మందివినే ఉంటారు.అయితే ఒకే సెన్సేషన్ న్యూస్ తో ఇద్దరు వ్యక్తులు పాపులర్ అయితే ఎలా ఉంటుంది. అది తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాలయలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి.. ఏసీబీకి దొరికిపోయారు. అలా ఎవరికైతే డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించారో ఆ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఒకే దెబ్బతో మీడియాలో బిగ్ షాట్ గా నిలిచారు. అప్పటి దాకా కనీసం ముఖ పరిచయం, పేరు కూడా పరిచయం లేని స్టీఫెన్ సన్ ఒక్కసారిగా మీడియాలో పాపులర్ అయ్యారు. ఎవరా.. స్టీఫెస్ సన్ అని అందరూ ఆరా తీసేంతగా హాట్ టాపిక్ గా మారారు. నామినేటెడ్ ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రభుత్వంలో భాగంగా ఉంటున్నారు స్టీఫెన్ సన్. నిన్నటి పరిణామాలు జరిగిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చిన స్టీఫెన్ సన్ కు ఘన స్వాగతం లబించింది. అందరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అతన్ని అబినందించారు.

ఇక ఏసీబీ వలలో చిక్కిన రేవంత్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ సర్కార్ మీదనో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీదనో ఆరోపణలు చేస్తూ మీడియాలో తరుచూ కనిపిస్తుంటారు అయితే నిన్నటి స్టింగ్ ఆపరేన్ తర్వాత రేవంత్ రెడ్డి మీడయాలో హాట్ టాపిక్ గా మారారు. ఇక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు లాంటి వాటితో ట్రెండింగ్ న్యూస్ గా మారారు. ఇక ఓటు వెయ్యడానికి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఘన స్వాగతం లభించింది. అటు తెలంగాణ టిడిపి నాయకులు అలానే బిజెపి నాయకులు రేవంత్ ను పలరించడానికి ఏకంగా క్యు కట్టారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఒకే ఇన్సిడెంట్ ఇద్దరిని హీరోలుగా చేసింది. మరి ఇంత విషయంలో జీరోలు ఎవరయ్యా..? అంటే దానికి సమాధానం ఎవరి దగ్గరా లేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  stephensun  MLC  telanagana  

Other Articles