talasani srinivas | telangana | narachandrababu | naralokesh | KCR | hyderabad

Talasani srinivas yadav fire on narachandrababu naidu and nara lokesh

talasani srinivas, telangana, narachandrababu, naralokesh, KCR, hyderabad

Talasani Srinivas yadav fire on Narachandrababu naidu and Nara lokesh. Talasani condemn the statements of narachandrababu naidu for Hyderabad development.

అయ్య బాబోయ్.. తలసానికి కోపం వచ్చింది

Posted: 05/30/2015 08:56 AM IST
Talasani srinivas yadav fire on narachandrababu naidu and nara lokesh

తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తెలుగుదేశం పార్టీ నేతలకు అస్సలు పొసగడం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తలసానితో సహా మరో ఇద్దరి మీద తెలుగుదేశం తమ్ముళ్లు కోర్టుకు వెళ్లారు. మరి ఆ కోపమో లేదా తమ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబందించిన విషయమో కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మీద అగ్గి మీద గుగ్గిలంగా ఎగిరిపడుతున్నారు. హైటెక్‌సిటీని కట్టి హైదరాబాద్ అభివృద్ధి అంతా తన ఘనతే అని చెబుతున్న చంద్రబాబు తన ముఖాన్ని ఓసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మహానగర చరిత్ర 400 ఏళ్ల పైమాటే అని, అది తెలుసుకుని మాట్లాడాలన్నారు. దిక్కూ మొక్కు లేని ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించుకుంటే బాగుంటుందని తలసాని చంద్రబాబుకు సూచించారు.

మీ కొడుకు పట్టిసీమలో ఎంత కొట్టేశారో తనకు తెలుసని పరోక్షంగా నారా లోకేష్ మీద ఆరోపణలు చేశారు. ఒక్క రోజు యోగా కోసం కోటి 25 లక్షలు ప్రభుత్వ నిధులను విడుదల చేస్తే ఎవరూ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం, నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ను వదల్లేదు తలసాని. ట్విట్టర్ పిట్ట మహానాడులో మాట్లాడుతుంటే కరెంటు పోయిందంట... ఇదీ ఇక్కడి పరిస్థితి అని అంటున్నాడు... ఇంట్లో ఎలా పడుకుంటున్నాడో అంటూ  లోకేశ్‌ను ఉద్దేశించి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే తెలంగాణ గురించి మాట్లాడినందుకే తలసానికి కోపం వచ్చిందా..? లేదా టిడిపి తమ్ముళ్లు తనకు వ్యతిరేకంగా చేస్తున్న పనుల వల్ల ఉడికిపోయి ఇలా చేస్తున్నారా..? అన్నదానిపై తలసాని తప్ప ఎవరూ సమాధానం ఇవ్వలేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas  telangana  narachandrababu  naralokesh  KCR  hyderabad  

Other Articles