PM took hour-long economics lesson from Manmohan Singh says Rahul Gandhi

Rahul gandhi takes a dig at modi government

Rahul Gandhi, Rastreya Swayamsevak Sangh, Narendra Modi, pm narendramodi, nsui, manmohan singh,economic classes

Stepping up the offensive, Rahul Gandhi hit out at BJP's ideological mentor RSS on Thursday saying its belief was "murdering" individuality and that thought process is now running the country in which only one man knows everything from farmers to clothes.

ఆర్థక పాఠాలు అబ్బాయా ప్రధాని మోడీ గారు..?

Posted: 05/28/2015 09:49 PM IST
Rahul gandhi takes a dig at modi government

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఒక కొత్త అంశాన్ని చర్చకు లేవనెత్తారు. ప్రధాని నరేంద్రమోదీని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలవడాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ మన్మోహన్ సింగ్ నుంచి నరేంద్రమోదీ దేశంలోని ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటంతో దాదాపు గంటపాటు తమ మాజీ ప్రధానితో భేటీ అయ్యి పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు. ఢిల్లీలో ఎన్ఎస్యూఐ కన్వెన్షన్లో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్పై విరుచుకుపడ్డారు. ఎవరు చెప్పినా వినే డీఎన్ఏ కాంగ్రెస్ పార్టీకి ఉందని కానీ, ఆరెస్సెస్ చెప్పిందే ఎవరైనా వినాలని చెప్పే లక్షణం మాత్రం బీజేపీకి ఉందని విమర్శించారు. ఆరెస్సెస్, బీజేపిలకు ఎవరు చెప్పినా వినే లక్ష్యణాలే లేవని తూర్పారబట్టారు. ఆరెస్సెస్ సిద్ధాంతాలను ప్రజలపై రుద్దాలని మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ప్రధాని మోదీ విదేశాలు తిరుగుతారు కానీ, రైతుల సమస్యలు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగోలియా వెళ్లేందుకు ఆయనకు సమయం ఉంటుందికానీ, రైతుల ఇంటికి వచ్చి వారిని పరామర్శించేందుకు ఆయనకు తీరిక లేకుండా పోయిందని చెప్పారు. కొత్తగా ఏర్పాటయిన బీజేపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని, అన్ని వర్గాలను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఏడాది కావొస్తున్నా.. ఇంకా నల్లధనం వెలికి తీయలేకపోయారని విమర్శించారు. మేకిన్ ఇండియా పనిచేయట్లేదని. అది ప్లాఫ్ షోగా మారుతుందని ఆయన విమర్శించారు. నల్లధనం మీద విచారణ ఎంతవరకు వచ్చిందని, అసలు ఏడాదిలో తెప్పిస్తానన్న నల్లధనం ఏదని ప్రశ్నించారు. చదువు కు పెద్దపీట వేయాలంటూనే బడ్జెట్ లో మాత్రం విద్యకు అత్యంత తక్కువ నిధులు కేటాయించడం మోడీ సర్కారుకే చెల్లిందని రాహుల్ ధ్వజమెత్తారు. ఎన్ఎస్యూఐ వర్గాలు ఆరెస్సెస్తో పోరాడి తీరాలని ఉద్బోధించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  pm narendramodi  nsui  manmohan singh  

Other Articles