Ap, Irrigation, Vijawada, Hyderabad, Chandrababu, Shift

Ap irrigation officials facing shiffting problem

Ap, Irrigation, Vijawada, Hyderabad, Chandrababu, Shift

Ap irrigation officials facing shiffting problem. Irrigation department higher officials order to shift thier office staff to vijayawada as possible as fast.

హైదరాబాద్ టు విజయవాడ అంత ఈజీ కాదు

Posted: 05/26/2015 07:39 PM IST
Ap irrigation officials facing shiffting problem

ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ సిబ్బందికి పెద్ద కష్టమే వచ్చిపడింది. హైదరాబాద్ లో ఉన్నవారంతా విజయవాడకు సర్దేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాలతో వారు పరేషాన్ అవుతున్నారు. ఉన్నతాధికారిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఉన్నపలాన హైదరాబాద్ నుంచి విజయవాడ తరలివెళ్లాలని చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఉత్తర్వులు వారికి గుస్సా తెప్పించాయి. ఇన్ని వందల మంది ఇప్పటికిప్పుడు తరలివెళ్లాలంటే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయనకు కాస్తైనా ఆలోచన ఉందా అని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

అయినా విజయవాడలో సరైన ఆఫీస్ లేకుండా, ఉండటానికి వసతి లేకుండా విజయవాడ వెళ్లమంటే ఎలా అని అడుగుతున్నారు. విజయవాడకు గాని, కొత్త రాజధానికి గాని వెళ్లడానికి తామంతా సిద్ధమేనని, అయితే ముందుగా మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. ఈ ఉత్తర్వులతో తమ పిల్లల చదువులు దెబ్బతింటాయని వాపోయారు. అన్ని వసతులు కల్పించిన తర్వాతే తమను తరలించాలని ఉన్నతాధికారికి విన్నవించారు. మరి దీనిపై అధికారులు ఏం నిర్ణయిస్తారో చూడాలి. అయితే హైదరాబాద్ లో పది సంవత్సరాలు ఉమ్మడిగా ఉండేందుకు అవకాశం ఉన్నా.. చంద్రబాబు నాయుడు మాత్రం వీలైనంత తొందరగా అధికార కార్యకలాపాలను విజయవాడకు తరలించాలని చూస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Irrigation  Vijawada  Hyderabad  Chandrababu  Shift  

Other Articles