Narendramodi | PM | NDA | Publicity | Amitsha

Pm narendramodi get more publicity for his one year govt

Narendramodi, PM, NDA, Publicity, Amitsha

Pm Narendramodi get more publicity for his one year govt. BJp cader getting ready to support one more time modi campaign.

మోదీ గురించి మరోసారి మోగిపోద్ది

Posted: 05/26/2015 02:50 PM IST
Pm narendramodi get more publicity for his one year govt

గత ఎన్నికల్లో మోడీని పీఎం చేయడానికి ఉపయోగించిన మాస్ క్యాంపెయిన్ ని మరోసారి తెరపైకి తీసుకురాబోతోంది కమలదళం. మోడీ మొదటి ఏడాది పాలనపై.. యాడ్స్ తో పేపర్లు, టీవీల్లో అదరగొట్టే ప్రమోషన్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి.. యాడ్స్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా  26వ తేదీ నుంచి ఈ యాడ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా గరీభీ విరోధ్ అనే బ్రాండ్ నుంచి బయటపడడానికి రైతుల యాడ్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు మోదీ. మొత్తానికి వన్ ఇయర్ అచ్చే దిన్ ప్రమోషన్ కోసం.. అచ్ఛే యాడ్స్, ఐడియాస్,  ప్రమోషన్స్ తో రకరకాల. కార్యక్రమాలు రూపొందిస్తోంది బిజెపి పార్టీ.  ప్రభుత్వం. ప్రతిపక్షాల విమర్శలన్నిటికీ సమాధానం చెప్పేలా ప్రచారాన్ని చేయనున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు మరోసారి నమోస్మరణతో మార్మోగిపోయేలా ప్రణాళికలు రూపొందించారు.

20 రోజులు.. 200 సభలు.. 5వేల ర్యాలీలు.. 10 కోట్ల మంది కార్యకర్తలతో.. 100 కోట్ల మంది భారతీయులకు రీచ్ అయ్యేలా ప్రచార కార్యక్రమాలు. ఇవన్నీ మోడీ ఏడాది పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వేసిన ప్లాన్స్. ఏం చేసినా ఓ రేంజ్ లో చేస్తున్న మోడీ వన్ ఇయర్ జర్నీపై కూడా  హై రేంజ్ ప్రచారానికి ప్లాన్ చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. ట్విటర్, ఫేస్ బుక్ నుంచి పాంప్లీట్ వరకు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు మోదీజీ. టోటల్ గా కమలనాధుల పాలన కేకపుట్టిస్తోందనిపించేలా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ఏ రేంజ్ లో ప్రచారం చేశారో.. దాన్నిమించిన రేంజ్ లో ప్రభుత్వ పాలనపై ప్రచారం చేయాలని మోడీ ఫిక్సయ్యారు. దీనికి సంబంధించి ఓ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. క్యాంపెయినింగ్ కు సంబంధించి ఓ డైరీ ప్రిపేర్ చేసి మంత్రులు, ఎంపీలకు డ్యూటీలు కూడా వేశారు మొత్తానికి ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పూర్తికావడంతో అందరికి కొత్త కొత్త డ్యుటీలు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendramodi  PM  NDA  Publicity  Amitsha  

Other Articles