21 year old teacher fallan kurek dies from blood clot after taking the contraceptive pills | contraceptive-pills

21 year old teacher fallan kurek dies from blood clot after taking the contraceptive pills

fallan kurek, teacher fallan kurek, contraceptive pills, brain dead, breathlessness, stomach pain problems

21 year old teacher fallan kurek dies from blood clot after taking the contraceptive pills : Tragedy as 'fit and healthy' 21-year-old dies from blood clot after taking the contraceptive pill for less than a MONTH.

గర్భ నిరోధక మాత్రలు.. ఓ టీచర్ ప్రాణాన్ని బలితీసుకున్నాయి!

Posted: 05/25/2015 07:35 PM IST
21 year old teacher fallan kurek dies from blood clot after taking the contraceptive pills

సాధారణంగా రోగాలు వచ్చిన క్రమంలో వాటినుంచి ఉపశమనం పొందేందుకు వైద్యుల సలహామేరకు మందులు వాడటం సహజం! వాటిని సమయాలనుకూలంగా క్రమం తప్పకుండా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని.. సదరు వ్యాధి నుంచి త్వరగా బయటపడవచ్చునని సలహాలు ఇస్తుంటారు. కానీ.. వాటిని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ప్రాణాలుపోయే ప్రమాదముంది. ఇందుకు నిదర్శనంగానే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.

రుతుస్రావం సక్రమంగా రావడం కోసం గర్భనిరోధక మాత్రలను ఓ టీచర్ తీసుకోగా.. అవి ఆమె జీవితంలో విషాదాన్ని నింపాయి. స్టాఫోర్డ్ షైర్ లోని టామ్ వర్త్ కు చెందిన ఫాలెన్ కురెక్.. టీచింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తోంది. అప్పటివరకు సంతోషంగా సాగిన ఆమె జీవితంలో అనుకోకుండా ఓ సమస్య ఎదురైంది. అదే రుతుస్రావం సక్రమంగా రాకపోవడం! దీంతో ఆమె రుతుస్రావం సక్రమంగా రావడానికి గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ప్రారంభించింది. అయితే.. ఆమె వాటిని పదేపదే తీసుకోవడం అలవాటుగా మార్చుకుంది. ఆ మందులను ఆమె 25 రోజులపాటు వాడింది. అంతే! అక్కడి నుంచి ఆమె అస్వస్థతకు గురైంది.

ఒక్కసారిగా వాంతులు ప్రారంభం కావడంతో పాటు శ్వాస పూర్తిగా నిలిచిపోయింది. ఆపై ఆమె శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ కురెక్ తల్లిదండ్రులు బ్రయాన్, జులియాల వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే మూడు రోజులపాటు ఐసీయూలో మృత్యువుతో పోరాడిన కురెక్ ఆ తర్వాత కన్నుమూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fallan kurek  contraceptive pills  

Other Articles