crane | tigers | zoo | china

A crane has wowed crowds in china after successfully managing to fight off an attack from two tigers

crane, tigers, zoo, china, attack

A crane has wowed crowds in China after successfully managing to fight off an attack from two tigers. The bird was blown into the tiger garden by strong winds at the Fuyang Wildlife Park in Zhejiang Province.

ITEMVIDEOS: మూడు పులులను పరుగులు పెట్టించిన కొంగ

Posted: 05/21/2015 04:06 PM IST
A crane has wowed crowds in china after successfully managing to fight off an attack from two tigers

టైం బ్యాడైతే అరటిపండు తిన్నా పళ్లు విరుగుతుందని సామెత ఉంది. అవును బ్యాడ్ టైంలో ఏం చేసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. తాజాగా బ్యాడ్ టైం అంటే ఏంటో  చైనా జైలో ఉంటున్న మూడు పులులకు బాగా అర్థమైంది. బలం లేకుంటే బల్లి పామై కరుస్తుంది అన్నట్లు పాపం ఓ కొంగ ఏకంగా పులులనే భయపెట్టింది. అయితే నిజానికి అక్కడ పులుల చేతిలో బలి కావాల్సిన కొంగ ఆ పులులనే భయపెట్టింది. పాపం అనుకోకుండా మూడు పులులు ఉన్న బోన్ లోకి వెళ్లిన కొంగ అక్కడున్న పులులను భయపెట్టిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. చైనా లోని హాంగ్ షూ జూలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్ ప్రపంచాన్ని ఐపేస్తోంది.



ఈ జూ లో ఓ కొంగ పొరపాటున పులుల బోను లోకి వెళ్ళింది. బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ కొంగ ని చూడగానే పులులకి నోరూరింది. ఎప్పుడూ జూ అధికారులు విసిరేసే మాసం తిని తిని బోరు కొట్టిన పులులు, ఈ రోజు చక్కగా వేటాడి మరీ కొంగ మాసం తినవచ్చు అనుకున్నాయి. కొంగ మీదకు దూసుకెళ్ళాయి. పులుల్ని చూసిన కొంగ తప్పించుకోవడానికి ట్రై చేసింది. అయితే, చుట్టూ కంచే ఉండటం తో తప్పించుకోవడం సాధ్యం కాలేదు. వెంటనే తిరగబడకపోతే ప్రాణం పోవడం ఖాయం అని అర్థం చేసుకుని పులులపై వెంటనే ఎదురుదాడికి దిగింది. రెక్కలు విప్పార్చి, గట్టిగా అరుస్తూ పులులమీద తిరగబడింది. దీనితో పులులు షాక్ అయ్యాయి. కొంగ నుండి తప్పించుకోవడానికి పరుగులు తీశాయి. కొంగ పులుల వెంటబడింది. పులులు భయంతో తలోదిక్కుకు పారిపోయాయి. కాసేపటికి అక్కడకు వచ్చిన జూ సిబ్బంది కొంగ బారి నుండి పులుల్ని రక్షించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crane  tigers  zoo  china  attack  

Other Articles