modi | help | 8year girl | agra

Modi helps 8 years old girl

modi, help, 8year girl, agra

With the cost of treatment of even minor ailments becoming more and more expensive, obtaining a health insurance has become imperative for everyone who can afford it. But for 8-year-old Tyeba from Agra, Prime Minister Narendra Modi proved to be the best health policy the little girl could ever buy.

ఎనిమిది సంవత్సరాల చిన్నారికి మోదీ అభయం

Posted: 05/21/2015 03:10 PM IST
Modi helps 8 years old girl

ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఎనిమిది సంవత్సరాల చిన్నారికి అభయమిస్తున్నారు. నీకు భయం లేదు బాలిక.. నేనున్నా అంటూ వెన్నంటి నిలుస్తున్నారు. ఓ ఎనిమిదేళ్ల ఓ చిన్నారి తనను బతికించండి అంటూ వేడుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తానే స్వయంగా లేఖ రాసింది. వివరాల ప్రకారం... ఆగ్రాలోని మంటోలా ప్రాంతానికి చెందిన మోహద్ ఖలీద్ కుమార్తె తయ్యాబా (8) అన్వారి నీలోఫర్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటుంది. ఆమె తండ్రి ఆగ్రాలోని చెప్పుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవలే తయ్యాబా గుండెకు రంధ్రం ఉందని తెలిసింది. ఢిల్లీ ఆసుపత్రిలోని డాక్టర్లు తయ్యాబాకు ఆపరేషన్ చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తయ్యాబా కుటుంబ సభ్యులకు ఏమీ పాలుపోలేదు.

అప్పుడే ఆ చిన్నారికి ఓ ఆలోచన తట్టింది. ప్రధాని నరేంద్రమోడీకి తనను కాపాడాలని వేడుకోవాలనుకుంది. ఈ మేరకు గుండెజబ్బుతో బాధపడుతున్న తనను కాపాడాలని, చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా సహాయం చేయాలని వేడుకుంటూ ప్రధానికి లేఖ రాసింది. ఆ లేఖలో  "నా హృదయానికి రంధ్రం ఉంది. నా ఆపరేషన్ కోసం మా నాన్న దగ్గర డబ్బు లేదు. ప్రధాని అందరికోసం పనిచేస్తారని చెప్పడం టివి ద్వారా తెలుసుకున్నాను. నేను బతికేందుకు అర్హురాలిని" అని పేర్కొంది. ఈ లెటర్‌తో వెంటనే స్పందించిన ప్రధాని కార్యాలయం... పాప ఆపరేషన్ కోసం ఢిల్లీలోని జెపి పంత్ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరిస్తుందని భరోసానిచ్చింది. లెటర్ పంపిన కొద్ది రోజులకే ప్రధాని నుంచి బదులు వచ్చిందని, ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేసిన ప్రధానికి తయ్యాబాతో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి మోదీ గారు ఆ చిన్నారిని ఆదుకోవడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  help  8year girl  agra  

Other Articles