chandrababu is always anti farmer and anti poor: RaghuveeraReddy

Andhrapradesh pcc chief raghuveera reddy takes on chandrababu

raghuveera reddy takes on chandrababu, chandrababu is always anti farmer and anti poor, AP CM chandrababu, andhrapradesh pcc chief raghuveera reddy, APPCC Chief, chandrababu, AP CM, ap special status

andhrapradesh pcc chief raghuveera reddy criticises that AP CM chandrababu is always anti farmer and anti poor

ఆయన నరనరాన రైతు వ్యతిరేక భావమే..

Posted: 05/19/2015 08:33 PM IST
Andhrapradesh pcc chief raghuveera reddy takes on chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నరనరాన రైతు వ్యతిరేక భావమే వుందన్నారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ప్రతిఫక్షంలో అధికారం కోసం మొసలికన్నీళ్లు కార్చిన బాబు.. అధికారం రాగానే వారిని పక్కన బెట్టి పరిశ్రమలు రావాలని, వారికి పెద్దపీట వేసేందుకే విదేశీ పర్యటనలు చేస్తున్నారని తూర్పారబట్టారు. రాజధాని నగరం నిర్మాణం కోసం భూ సేకరణ చట్టాన్ని అమలుపరస్తున్న బాబు.. రైతులు ముఖంలో ఎలా సంతోషాన్ని చూస్తున్నారని ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని రఘువీరా ఆరోపించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ పేర్కొంటే... కాదు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని.. కేంద్రంలో బీజేపి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. ఇంకా ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత లేదని ఆయన చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు నాన్చుడు ధోరణి అవలంబించడంపై రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuveera reddy  chandrababu  anti poor  anti farmer  

Other Articles