vijayawada durga temple priest suspended

Priest gets miss behaviour in guntur

vijayawada, durga temple priest viswanatha sastri, obscene dances, kodandarama temple, ganjaa, vulgar songs, hanuman jayanti, dias, vulgar dances, devotees, angry, thrown eggs, temple eo narsingrao, obscene dances, rama temple, vulgar dance

vijayawada durga temple priest viswanatha sastri suspended for doing obscene dances in kodandarama temple at guntur on hamuman jayanthi

అర్చక మహాశయులు కుప్పిగంతులు.. భక్తుల పిర్యాదు

Posted: 05/17/2015 03:37 PM IST
Priest gets miss behaviour in guntur

ఆధ్యాత్మికతను పదిమందికి పంచిపెట్టాల్సిన గౌరవప్రదమైన అర్చకవృత్తిలో కోనసాగుతూ.. అత్యంత దిగజారుడు పనులకు పూనుకున్నాడు. పైపెచ్చు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదీనూ హనుమాన్ జయంతి రోజున వెకిలి చేష్టలు, కుప్పిగంతులు వేసి.. భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు ఈ ఘనుడు. సదరు విషయమై ఆలయ ఈఓకు పిర్యాదు చేయడంతో అతడిని సస్పెన్షన్‌కు గురిచేశారు. ఇంతకీ ఈ పనులకు పాల్పడింది ఎవరా..? అనేగా మీ సందేహం. ఆయన మరెవరో కాదండీ.. విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంధ్రకీలాధ్రి ఆలయ పూజారి చెరువు విశ్వనాథ శాస్త్రి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలివీ...గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయాన్ని విజయవాడ దుర్గగుడి దత్తత తీసుకుంది. ఈ ఆలయంలో హనుమ జయంతి నాడు పలు కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కాశీ విశ్వనాథశాస్త్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు. గంజాయి సేవించి వచ్చి బూతు పాటలు పాడుతూ వేదిక మీద కుప్పిగంతులు వేశాడు. ఇతని తీరుపై ఆశ్చర్యపోయిన భక్తులు కొందరు అక్కడినుంచి నిష్క్రమించగా, మరికొందరు ఆగ్రహంతో అతనిపై కోడిగుడ్లు విసిరారని తెలిసింది. భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన దుర్గ గుడి ఈవో నర్సింగరావు.. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. నిజానిజాలు వెల్లడయ్యేవరకు పూజారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viswanatha sastri  priest  miss behaviour  guntur  

Other Articles