modi | china | pakistan | terrorism

Pm modi attacks on pakistan for terrorism

modi, china, pakistan, terrorism

Pm modi attacks on pakistan for terrorism. In china modi clear that terrorism will collapse the country and the world.

పాకిస్థాన్ ఎలా పాడైందో తెలుసా: మోదీ

Posted: 05/16/2015 08:07 AM IST
Pm modi attacks on pakistan for terrorism

పాకిస్థాన్ పరిస్థితి తెలుసుగా ఎలా జరిగిందో.. అందుకే అతివాదం, తీవ్రవాదాలను వీలైనంత దూరంగా ఉంచాలి అంటూ ప్రధాని నరేంద్రమోదీ చైనాలొ పిలుపునిచ్చారు. ఏ దేశానికైనా ఈ రెండు అంశాలు శత్రువులుగా తయారయ్యాయని మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌తోపాటు చైనా దేశానికి కూడా అతివాదులు, తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి వుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ రెండు దేశాలు సరిహద్దు తీవ్రవాదం సమస్యను ఎదుర్కొంటున్నా యన్నారు. ఇరు దేశాల భద్రత, అభివృద్ధి అంశాలపై అస్థిత్వ పరిస్థితుల ప్రభావం పడుతోందని అన్నారు. అతివాదం, తీవ్రవాదం వల్ల చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్‌ను మోడీ ఉదహరించారు. రెండు రకాల ఉగ్రవాదాలు ఒకే చోట నుంచి బయలుదేరుతున్నాయని పేర్కొన్నారు. సరిహద్దు తీవ్రవాదం సమస్యతో భారత్‌, చైనా ఇబ్బందిపడుతున్నాయని, ముంబయి, సిజియాంగ్‌ ప్రావిన్స్‌లలో తీవ్రవాద ఘటనలకు పాల్పడ్డవారు పాకిస్తాన్‌లో శిక్షణ పొందారన్న విషయం గుర్తించాలన్నారు. తరుచూ రూపాన్ని మార్చుకుంటున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్నారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, మోడీల మధ్య సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదల అయింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ఖండిస్తున్నామని, కౌంటర్‌-టెర్రరిజం ద్వారా తుదముట్టించాల్సిందేనని, దీనిపై పరస్పరం సహకరించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని అరికట్టడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని, తీవ్రవాదులకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడంలో దేశాలన్నీ నిజాయితీగా పనిచేయాలని ప్రపంచ దేశాలకు సూచిం చారు. చైనా ప్రధానితో జరిగిన సమావేశంలో మోడీ మాట్లా డుతూ, కేవలం ద్వైపాక్షిక సంబ ంధాల బలోపేతమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ఇరు దేశాల మధ్య సహకారం పెరగాలని అన్నారు. ఇరు దేశాల అభివృద్ధిలో ఇది కీలకాంశం కానుందన్నారు. ఈ చైనా పర్యాటకులకు ఈ-వీసాలు మంజూరు చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  china  pakistan  terrorism  

Other Articles