Telangana | High court | KK

Telangana leaders demand seperate high court for telangana state

Telangana, High court, KK, TRS, Sadananda gouda

Telangana leaders demand seperate high court for Telangana state. TRS party leader kk and some more leaders met sadananda gouda for high court.

హైకోర్టు కావాలని అడగండి.. అంతేగానీ ఇలా మాట్లాడకండి

Posted: 05/09/2015 08:06 AM IST
Telangana leaders demand seperate high court for telangana state

తెలంగాణ మంత్రులు, ఎంపీలు చేస్తున్న అతి అబాసుపాలవుతోంది. మన దేశంలో అందరికి పూర్తి నమ్మకం ఉన్న ఒక్క న్యాయవ్యవస్థ మీద మాత్రమే. అయితే అలాంటి న్యాయ వ్యవస్థకు నిలయాలు కోర్టులు. అయితే ప్రాంతీయ అబిమానం కాస్త ఎక్కువై తెలంగాణ మంత్రులు, ఎంపీలు హైకోర్టు గురించి నోటికి వచ్చినంత మాట్లాడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉమ్మడి హైకోర్టుపై తమకు విశ్వాసం పోయిందన్నారు. విభజన సమయంలో కూడా82 మంది జడ్జిలను నియమించారని, తెలంగాణ భూముల్ని ఆంధ్రావారికి ఇస్తూ తీర్పులు వస్తున్నాయని, ఈ తీరు చూస్తోంటే కొన్నాళ్లకు తెలంగాణనే ఉండదే మోనన్న భయం వేస్తోందన్నారు. ఒకవేళ కేంద్రం ప్రత్యేకహైకోర్టు ఏర్పాటు చేయలేకపోతే తమ కేసుల న్నింటినీ మహారాష్ట్ర లేదా కర్ణాటకహైకోర్టులో దాఖలు చేసుకుంటామని, అంతే తప్ప ఉమ్మడి హైకోర్టులో మాత్రం వాదనలు వినిపించేందుకు సిద్ధంగా లేమని కేంద్ర మంత్రికి స్పష్టం చేశామన్నారు. ఉమ్మడి హైకోర్టు ఆంధ్రా డామినేటెడ్‌ హైకోర్టు అని, 25మంది జడ్జిల్లో ఆరు గురు మాత్రమే తెలంగాణ వారున్నారని చెప్పారు. కాగా, హైకోర్టు తీర్పు తమకు అందిందని, పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని కేకే తెలిపారు.

మరో పది పదిహేను రోజుల్లోపు తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను కలిసి డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1968 కంటే ముందు రావటానికి కారణం కోర్టులేనని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలన్నది ప్రజల మనస్సులో బలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి సలహాదారు కే. కేశవరావ్ వెల్లడించారు.  ప్రత్యేక హైకోర్టు గురించి ప్రత్యేకంగా అడగాల్సిన పనిలేదని, అయినా స్వార్థ ప్రయోజనాలరీత్యా దీనిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విభజన చట్టానికి, హైకోర్టుకు ఎలాంటి సం బంధం లేదన్నారు. అయినా హైకోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు చెయ్యండి అన్న వాదన చెప్పడానికి ఏకంగా న్యాయం జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వస్తున్నాయి... కోర్టు మీద నమ్మకం పోతోంది అన్నట్లు తెలంగాణ నేతలు మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  High court  KK  TRS  Sadananda gouda  

Other Articles