Salman khan | Lawyer | Harish slave

Salman khan paid large amount to his lawyer for his work

Salman khan, Lawyer, Harish slave, Mumbai, Ambani, Sureme court, High court

The Maharashtrian Christian is the son of former Union Minister N.K.P. Salve. Initially a chartered accountant, Salve later shifted to practicing law full time. He is sought after by everyone because of his penchant for extricating clients from inconvenient situations and even turning the tables to get a favourable order. The Ambanis apparently paid nearly Rs 15 crore just on lawyer fees when they had hired Salve’s services for a few legal tangles.

సల్మాన్ ఖాన్ లాయర్ కు ఎంతిచ్చాడో తెలుసా.. ?

Posted: 05/08/2015 10:53 AM IST
Salman khan paid large amount to his lawyer for his work

సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో కొర్టు ఏకంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది. అయితే ఆ షాక్ నుండి తేరుకునేలోపే హైకోర్టుకు వెళ్లి రెండు రోజుల గడువుతో బెయిల్ పొందారు సల్మాన్ ఖాన్. అలా సల్మాన్ ఖాన్ కు బెయిల్ రావడానికి కేసు గురించి ప్రతి విషయం తెలిసిన ఓ లాయర్ కారణం. అవును సల్మాన్ కేసులో దాదాపుగా 5 సంవత్సాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ముందే తెలిసిన ఆ లాయర్ సల్మాన్ ఖాన్ కు ఆ విషయాన్ని కూడా ముందే చెప్పారట. అలా జైలు శిక్ష గనక పడితే ఏం చెయ్యాలో కూడా ఆ లాయర్ వివరించారట. అలా మొత్తం వెనకుండి నడిపించిన లాయర్ కు సల్మాన్ ఖాన్ ఎంతిచ్చారో తెలుసా?.. అక్షరాల 25 లక్షల రూపాయలు. అవును 25 లక్షల రూపాయల ఫీజ్ చెల్లించారట సల్మాన్ ఖాన్. అసలు ఆ లాయర్ ఎవరు?.. లాయర్ వివరాలు తెలియాలంటే స్టోరీ చదవండి.

కేంద్ర మాజీ మంత్రి ఎన్.కె.పి సాల్వే కొడుకు  హరీష్ సాల్వే. ముందు చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేసిన హరీష్ తర్వాత లాయర్ గా మారారు, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ లలో తన లాయర్ ప్రాక్టీస్ తో చాలా కేసులను అవలీలగా గెలిచాడు. దాంతో ఎక్కడెక్కడ ఉన్న లిటికేషన్ కేసులు హరీష్ సాల్వే దగ్గరికి వచ్చేవి. అయితే ఇతని కింద దాదాపు ఆరు మంది జూనియర్లుగా పని చేస్తున్నారు. వారు కూడా ఎంతో పేరు గడించారు. రతన్ టాటా, ముఖేల్ అంబానీ లాంటి దిగ్గజ కార్పోరేటర్లు కూడా హరీష్ సాల్వే కోసం క్యు కడుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. లీగల్ అడ్వైజ్ ల కోసం అంబానీ కంపెనీ 15 కోట్లు చెల్లిస్తోందంటే హరీష్ సాల్వే కెపాసిటి ఏంటో తెలుసుకోవచ్చు. కాగాఈ రోజు సల్మాన్ ఖాన్ కేసులో వాదించడానికి హరీష్ సాల్వే రావడం లేదని తెలిసింది. మరి ఏం జరుగుతుందో కొద్దిసేపట్లో తెలుస్తుంది.

(Source: www.deccanchronicle.com)

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Lawyer  Harish slave  Mumbai  Ambani  Sureme court  High court  

Other Articles