Passengers | Strike | Telangana| AP

Passengers facing heaven by the rtc strike in both telugu states

Passengers, demands, Strike, Telangana, AP, RTC Unions

passengers facing heaven by the rtc strike in both telugu states. From yesterday night rtc called for strike for their certain demands.

దేవుడా.. నరకం చూస్తున్న ప్రయాణికులు

Posted: 05/06/2015 08:30 AM IST
Passengers facing heaven by the rtc strike in both telugu states

ఇరు తెలుగు రాష్ర్టాల్లోని ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు ఎక్కడివక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్థరాత్రి నుంచే కార్మిక సంఘాలు పూర్తిస్థాయిలో సమ్మెకు దిగడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్‌లోనే రాత్రంత పడిగాపులు కాయాల్సివచ్చింది. తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. డిపోల వద్ద భారీ బందోబస్తును చేపట్టారు. ఒకవైపు పెద్ద సంఖ్యలో జరుగుతున్న పెళ్లిళ్లు మరో వైపు రోజువారి విధులకు హాజరుకావాల్సి ఉండటంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల వద్ద నుంచి రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ తెల్లవారుఝామునుంచి ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ కార్మికసంఘాలు సమ్మెకు దిగాయి.  ఈ సమ్మెలో  4,500 మంది కార్మికులు పాల్గొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు  ఆర్టీసీ ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మద్దతు పలుకుతున్నాయి.

*abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Passengers  demands  Strike  Telangana  AP  RTC Unions  

Other Articles