vijaya ramarao condemns ex delhi police chief neeraj kumar comments

Dawood ibrahim wanted to surrender cbi didnt go along ex delhi police chief neeraj kumar

Dawood Ibrahim, surrender, CBI, Ex-Delhi Police chief Neeraj Kumar, Dawood Ibrahim, surrender, vijaya ramarao, CBI Ex-Chief, neeraj kumar chief publicity,

vijaya ramarao condemns ex delhi police chief neeraj kumar comments that underworld don dawood ibrahim wanted to surrender

ఇండియన్ మోస్ట్ వాంటెడ్ దావూద్ పై మాజీ అధికారుల తలోమాట..

Posted: 05/02/2015 06:39 PM IST
Dawood ibrahim wanted to surrender cbi didnt go along ex delhi police chief neeraj kumar

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్  డాన్ దావూద్ ఇబ్రహీం గురించి.. సీబిఐలో పలు కీలక పదవులను అలంకరించిన మాజీ అధికారులు ఇన్నాళ్లుకు పలు సంచలన విషయాలను మీడియా ముందు పెట్టారు. దావూద్ ఇబ్రహీంపై సీబిఐకి చెందిన మాజీ అధికారులు తలో మాటా తత్ భ్నినంగా చెప్పడమే ఇప్పుడు సంచలనమైయ్యింది. ముంబై వరుస పేలుళ్లు జరిగిన 15 నెలలకే ప్రధాన సూత్రదారి దావుద్ లొంగిపాతానని రాయబారం నడిపినట్టు ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. అప్పటి సీబీఐ డీఐజీగా ఉన్న తనకు దావుద్ మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు నీరజ్ కుమార్ చెప్పారు.

మార్చి 12, 1993న ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మందికి పైగా గాయాలయ్యాయి.. అయితే ఈ ఘటన జరిగిన 15 నెలలకే తాను లోందిపోతానాని దావుద్ రాయబారం నడిపారని నీరజ్ కుమార్ చెప్పారు. భారత్ వస్తే ప్రత్యర్థులు తనని హతమారుస్తారెమోననే భయంతోనే దావుద్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు నీరజ్ తెలిపారు. కానీ అతను లొంగిపోతానన్న ప్రతిపాదనని సీబీఐ అంగీకరించలేదని చెప్పారు. భారత్ వచ్చి లొంగిపోతానని దావుద్, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానితోనూ రాయభారం సాగించారు. 2013లో ఢిల్లీ పోలీస్ కమిషనర్గా రిటైర్ అయిన నీరజ్ కుమార్ తన అనుభవాలను పుస్తకంలో రాయనున్నారు.

అయితే నీరజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను అప్పటి సీబీఐ చీఫ్ విజయ రామారావు తీవ్రంగా ఖండించారు.  తాను సీబీఐ చీఫ్గా ఉన్నప్పుడు దావుద్కు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు.  దావుద్ కోసం ఇప్పటికీ అనేక దేశాలు వెతుకుతున్నాయని లొంగిపోతానంటే వదిలేస్తామా అని విజయ రామారావు ప్రశ్నించారు. దావుద్ లొంగుబాటుపై అప్పట్లో తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.   అతని గురించి చాలా సమాచారం మాత్రం వచ్చిందని, అయితే లొంగుపోతానని దావుద్ ప్రతిపాదన చేయలేదన్నారు. తాను సీబీఐ చీఫ్గా ఉన్నప్పుడు దావుద్ కోసం దుబాయ్ సహా అనేక దేశాల్లో ఎంతో గాలించామని విజయ రామారావు తెలిపారు.  దావుద్ సరెండర్ అవుతానన్న విషయం తనకు ఏ అధికారి చెప్పలేదని, ఏ సమాచారం ఇచ్చినా రికార్డు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dawood ibrahim  vijaya ramarao  neeraj kumar  CBI  

Other Articles