Women activists react as govt says marital rape not offence as marriage is sacrosanct in India

Centre says marital rape not a crime as marriage is sacrosanct in india

marital rape, marriage, home ministry, kanimozhi, haribhai parthibhai chaudhary, women freedom, rape, Indian Penal Code, Minister of State for Home Affairs H.P. Chaudhary, crime, sexual assault; rape, government, ministers (government), politics, parliament, husband forceful sex with wife,

Women activists react as government said that marital rape is not an offence as marriage is sacrosanct in India. AIDWA General Secretary Jagmati Sangwan said that rape is a crime and when done by husband, it is an aggravated form of the crime.

వైవాహిక అత్యాచారం అంశంలో పెల్లుబిక్కుతున్న నిరసనలు

Posted: 05/01/2015 08:00 PM IST
Centre says marital rape not a crime as marriage is sacrosanct in india

వైవాహిక అత్యాచారాలను రేప్ గా పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంటా, బయటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భార్యలకు ఇష్టం లేకున్నా తమ భర్తలు వారిపై నయానో, భయానో లొంగదీసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నరని.. ఈ విధంగా భారత్ లో రమారమి 75 శాతం మంది మహిళలు భర్తల చేతిలో బలత్కారాలకు లోనవుతున్నారని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ అందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో చట్టాలను సవరించాలని ఐక్యరాజ్యసమితి భారత్ ను కోరింది.

ఈ అంశంపై రాజ్యసభలో ప్రశ్నించిన డిఎంకే సభ్యురాలు కనిమొళికి సమాధానమిచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి సమాధానం ఇస్తూ.. మన దేశంలో నెలకొన్న భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని వైవాహిక అత్యాచారంగా నిర్వచించలేమని, అలాంటి ఆలోచనేమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భర్తలకు మినహాయింపునిస్తున్న ఐపీసీలోని 375ని సవరించే యోచనేదీ లేదన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా మహిళా సంఘాలు నిరసనలు కోనసాగిస్తుండగా, ప్రపంచ దేశాలు భారత్ నేపాల్ ని చూసి నేర్చుకోవాలని సలహానిస్తున్నాయి.

అత్యాచారం నేరంగా పరిగణించనప్పుడు వైవాహిక అత్యాచారాన్ని ఎందుకు నేరంగా పరిగణించలేరని భర్తలు బలత్కారం చేస్తే ఎందుకు తప్పుకాదని అద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్ మతి సంగ్వన్ ప్రశ్నించారు. వైవాహిక అత్యాచారాలలో నేరం ఇంకా అధికంగా వుండాలని ఆమె డిమాండ్ చేశారు. డిల్లీ మహిళా కమీషన్ చైర్ పర్సెన్ బార్ఖ శుక్లా ఈ విషయమై స్పందిస్తూ.. మహిళలకు వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసే స్వాతంత్ర్యం, స్వేచ్ఛ వారికి ఉండాలన్నారు. తమకు అన్ని విషయాల్లోనూ భద్రత వుందని మహిళలు భావించాలని అభిప్రాయపడ్డారు. మహిళా ఉద్యమకారిణి అభాసింగ్ ఈ విషయమై స్పందిస్తూ.. వైవాహిక అత్యాచారాలపై సమగ్ర చర్చ జరగాల్సన అవసరం వుందని, అప్పుడే చట్టాలను సవరించేందుకు అవకాశం వుంటున్నారు.

కాగా ప్రపంచ దేశాలు కూడా భారత్ వైవాహిక అత్యాచారాలను సమర్ధించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంలో భారత్ దేశ సంస్కృతి, కట్టుబాట్లు, వైవాహిక నేపథాన్యినిక సంబంధించిన అంశాలను పేర్కోంటూ భర్తల బలత్కారాలను సమర్థించడాన్ని తప్పుబడుతున్నాయి. సంపూర్ణ హిందూ దేశంగా వున్న నేపాల్ ను  చూసి వైవాహిక అత్యాచారాలను కూడా నేరంగా పరిగణించాలని చెబుతున్నాయి. 2006లో ఈ మేరకు నేపాల్ సుప్రీంకోర్టు మారిటల్ రేప్ కూడా నేరంగా పరిగణించిందని, ఆ సమయంలో 12 పేజీల మేర తీర్పును వెలువరించిందని పలు దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

జి మనోహర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : forceful sex  husband  wife  union home ministry  

Other Articles