2 Women Arrested in Brawl Over Parking Space Outside Long Island Mall

Both women in green acres mall parking lot brawl arrested

Two Queens women arrested, Two Queens women brawl over a parking spot, Long Island mall, Latoya Friday of the Rockaways, Tawana Morel of Rosedale, misdemeanor assault, desk appearance tickets, Valley Stream parking, 2 women, caught-on-camera,

Two Queens women have been arrested in connection with a brawl over a parking spot outside a Long Island mall that was captured on video, police said

ITEMVIDEOS: పార్కింగ్ కోసం.. పిడిగుద్దుల ఫీట్లు.. ఆడళ్లా.. మజాకా..?

Posted: 04/30/2015 05:39 PM IST
Both women in green acres mall parking lot brawl arrested

పార్కింగ్ స్థలం కోసం గొడవ పడి, ఒక మహిళను మరో మహిళ పిడిగుద్దులు గుద్దిన ఘటనలో ఇద్దరు క్వీన్స్ మహిళలను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిపై చట్టవిరుద్దంగా దౌరన్యానికి పాల్పడిన సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎప్పడు పిలిస్తే.. అప్పడు తమ ఎదుట హాజరయ్యేందుకు అంగీకరించడంతో వారికి డెస్క్ అపియరెన్స్ టిక్కెట్లు (బెయిల్) పై విడుదల చేశారు. పార్కింగ్ స్థలం కోసం జరిగిన గొడవ కాస్తా ముదిరి ఇద్దరు మహిళలు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ వీడియో  సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఆదివారం రోజున వ్యాలీ స్ట్రీమ్ లోని గ్రీన్ ఎకర్స్ మాల్ ఎదుట పార్కింగ్ స్థలంలో  24 ఏళ్ల లటోయియా ఫ్రైడే తమ కారుని పార్క్ చేయడానికి వెళ్లింది. అయితే అదే స్థలంలో తమ వాహనాన్ని పార్క్ చేసుకుంటామని ఒక వ్యక్తి కారుని ఆపాడు. కారు దిగిన లటోయియా తనను ఆస్థలంలో ఎందుకు కారును పార్క్ చేయనివ్వలేదని అడిగింది.
 

దీంతో కారు పార్క్ చేసిన వ్యక్తి భార్య త్వానా మోరెల్.. లటోయియాతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ముందుగా రెచ్చిపోయిన లటోయియా ఫ్రైడే.. త్వానా మారెల్ తలపై బాదింది. అంతే ఇక కోపంతో ఊడిపోయిన త్వానా మారెల్.. తన భర్త, కుమారుడు చూస్తుండగానే సదరు మహిళని రోడ్డుపై పడేసి, మీద కూర్చొని ముఖం మీద పిడిగుద్దులు కురిపించింది. మరోవైపు భార్యను వారించాల్సిన  భర్త కూడా మరింత కొట్టమని ప్రోత్సహించడంతో బాధితురాలిని చితక బాదింది. అడ్డుకోబోయిన మరో మహిళను కూడా భర్త నిలువరించారు. అమె ముందు తన భార్యపై దాడి చేసిందని చెప్పాడు. ఫ్రైడే తలను చితకబాదమని అమె తన నోటికి పనిచెప్పిందని భార్యను ప్రోత్సహించాడు. ఎట్టకేలకు ఇద్దరు మహిళను వచ్చి అడ్డుకున్న తరువాత కూడా భర్త నోరు తెరిచినందుకు తగిన శాస్తి జరిగిందా..? అంటూ ముక్తాయించడం కోసమెరుపు. చివరికి ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, బెయిల్ పై వదిలారు. కాగా భర్తపై కేసు నమోదు విషయమై పోలీసులు పరిశీలిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Valley Stream parking  2 women  caught-on-camera  

Other Articles