AAP govt delayed post-mortem, accuses Delhi Police

Mob incited farmer gajendra singh to commit suicide

AAP govt delayed post-mortem, accuses Delhi Police, mob incited farmer gajendra singh to commit suicide, Gajendra Singh, Aam Aadmi Party, AAP, Arvind Kejriwal, Delhi, Jantar Mantar rally, farmer's death

In its report to the Union Home Ministry on the suicide of Gajendra Singh, the Delhi Police, Wednesday, blamed the Aam Aadmi Party and the crowd present at its Jantar Mantar rally for the farmer's death.

గజేంద్ర మరణానికి.. అప్ నేతలే కారణం..

Posted: 04/29/2015 07:28 PM IST
Mob incited farmer gajendra singh to commit suicide

ఢిల్లీలో నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ర్యాలీలో ఉరి వేసుకుని మరణించిన గజేంద్ర సింగ్.. ఆత్మహత్యకు అప్ నేతల రోచ్చగోట్టే ప్రసంగాలే కారణమని ఢిల్లీ పోలీసులు అధికారికంగా తేల్చారు..కిసాన్ ర్యాలీలో ఆప్ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం అతడిని ఆత్మహత్యకు పురికొల్పాయన్నారు. దీంతో పాటు ఘటన స్థలం వద్ద వున్న ఆప్ కార్యకర్తలు ఆయనను ఉసిగోల్పారని పోలీసులు తేల్చారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించారు. గజేంద్ర సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునేందుకు ఆప్ ప్రభుత్వం ప్రయత్నించిందని నివేదికలో ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.

కాగా, ఏ కేసు విచారణలోనైనా ప్రత్యక్ష సాక్షుల వాంగూల్మామే అత్యంత కీలకమని ఢిల్లీ పోలీసు చీఫ్ బీఎస్ బాసీ మీడియాతో చెప్పారు. విచారణలో దర్యాప్తు అధికారి ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తారని, కేసుకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తారని వెల్లడించారు. రాజస్థాన్‌లోని దౌసా గ్రామానికి చెందిన రైతు గజేంద్రసింగ్ ఈనెల 22న జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ సంస్కరణల చట్టంలోని సవరణలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో గజేంద్ర సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

అయితే రైతుఃగజేంద్రసింగ్ ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని విమర్శలు కూడా వినబడుతున్నాయి. నేరాన్ని అప్ కార్యకర్తలు, నేతల ప్రసంగాల పైకి నెట్టి.. పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ ముందుగా ఆరోపించినట్లే పోలీసుల నివేదిక వుందని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gajendra Singh  Delhi Police  AAP rally  

Other Articles