CBI files chargesheet against Jindal, 14 others in Jharkhand coal block case

Coal scam cbi files charge sheet against 14 individuals and 5 companies

CBI files chargesheet in coal block case, cbi names dasari narayan rao, jindal, Amarkonda Murgadangal coal block, Jharkhand coal block allocation case, Naveen Jindal, CBI, CBI chargesheet,crime, law and justice ,police ,energy and resource ,coal, Central Bureau of Investigation (CBI), coal scam, Jindal Steel and Power (JSPL), Naveen Jindal, India business report

The CBI on Wednesday filed chargesheet against industrialist Naveen Jindal and 14 others in Amarkonda Murgadangal (Jharkhand) coal block allocation case.

ఆ జాబితాలో దాసరి పేరు.. మరో 13 మందిపై కూడా..

Posted: 04/29/2015 03:55 PM IST
Coal scam cbi files charge sheet against 14 individuals and 5 companies

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ బుధవారం నాడు మరో చార్జిషీట్‌ దాఖలు చేసింది. తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారయణ రావు పేరును కూడా సీబీఐ తన చార్జిషీటు జాబితాలో చేరింది. దాసరి, నవీన్‌ జిందాల్‌ సహా 14 మందిపై అభియోగాలు మోపింది. వీరితో పాటుగా మరో ఐదు కంపెనీలపై కూడా అభియోగాలను మోపింది. అమరకొండ ముర్గాదంగల్(జార్ఖండ్) బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో ఆయన పాటు 14 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తాలపై అభియోగాలు మోపింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో పెట్టారు. నేరపూరిత కుట్ర, ఛీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. ఈ ఛార్జిషీట్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం పరిశీలించనుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles