Nara Chandrababu Naidu | TTDP |Mahanadu |Hyderabad

Telanagana telugudesam party leaders requesting to conduct telugudesam mahanadu in hyderbad

Telanagana Telugu Desam Party, Nara Chandrababu Naidu, TTDP,Mahanadu, TRS, Hyderabad

Telanagana telugudesam party leaders requesting to conduct telugudesam mahanadu in hyderbad. TTDP leaders Yerraballi Dayakar rao, L.Ramana, Mothkupalli narsimlu met TDP President Nara Chandrababu Naidu.

టిఆర్ఎస్ విజయ గర్జనకు దీటుగా టిడిపి సింహగర్జన

Posted: 04/29/2015 07:56 AM IST
Telanagana telugudesam party leaders requesting to conduct telugudesam mahanadu in hyderbad

తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన విజయ గర్జనకు దీటుగా సింహగర్జన నిర్వహిద్దామని తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెస్తున్నారు. టి.టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు. వచ్చే నెల హైదరాబాద్‌లోనే మహానాడు నిర్వహించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. హైదరాబాద్ నగర శివారులోని గండిపేటలోని తెలుగు విజయంలో మహానాడు నిర్వహించాలని వారు సూచించారు. మహానాడు ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గర్జన నిర్వహించి సత్తా చూపిద్దామని వారు తెలిపారు.

1994 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్టీరామారావు నిర్వహించిన సింహగర్జన తరహాలో గర్జన నిర్వహించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అలా సింహగర్జన నిర్వహిస్తే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలపై సానుకూలమైన ప్రభావం ఉంటుందని, తమ పార్టీ తరఫున ఎన్నికై టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకూ గుణపాఠంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఇలాఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మొదటి సారి మహానాడు వచ్చినందున, తప్పనిసరిగా ఆంధ్రలోనే ఏదైనా జిల్లాలో మహానాడు నిర్వహించాలని ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బాబు డైలమాలో పడ్డారు. అయితే వచ్చే నెల 2న జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి కూడా ప్రతి ఏటా ఎక్కువ సార్లు హైదరాబాద్‌లోనే మహానాడు జరిగిందని, కేవలం నాలుగు సార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్నందున అక్కడ నిర్వహిస్తే ఏర్పాట్ల విషయంలో ఇబ్బందులు ఉండవని, హైదరాబాద్‌లో నిర్వహిస్తే శ్రీకాకుళం వంటి మారుమూల జిల్లాల నుంచి వచ్చే నాయకులకు, ప్రతినిధులకు ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana Telugu Desam Party  Nara Chandrababu Naidu  TTDP  Mahanadu  TRS  Hyderabad  

Other Articles