Nepal | Selfies | Manuments | Marchants | India | Earth quake

On major earth quake in nepal some persons forgot humanity

nepal, selfies, manuments, marchants, india, earth quake,

On major earth quake in nepal some persons forgot humanity. Some people rising selfies at the old manuments with the effect of earth quake. some marchants hike the prices of all materials.

రేయ్.. బాబు.. మనుషుల్లా ప్రవర్తించండి.. నేపాల్ ఆవేదన

Posted: 04/28/2015 04:00 PM IST
On major earth quake in nepal some persons forgot humanity

నేపాల్ లో భారీ భూకంపం వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం కలిగింది. అయితే ప్రపంచం మొత్తం నేపాల్ కు సాయం చెయ్యడానికి ముందుకు వస్తోంది. నేపాల్ కు సహాయం చెయ్యడంలో అన్ని దేశాల కన్నా భారత్ ఎంతో ముందుంది. భారత్, చైనా, అమెరికాలాంటి దేశాలు నేపాల్ కు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అయితే నేపాల్ ప్రజలను ఆదుకోవడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. . ఈ విషాద సమయంలోనూ వ్యాపారులు ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం కనీసం వ్యాపారులనయినా నిలువరించలేకపోతోందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో పక్క భూకంపం వల్ల కుప్పకూలిన చారిత్రక ధారాహర టవర్ వద్ద ఇప్పుడు సెల్ఫీల గోల మొదలయింది. విషాదమే అయినా.. చారిత్రక సాక్ష్యం అంటూ అక్కడికి వచ్చిన వారంతా శిథిలాలపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు.  మరోవైపు  ఈ చర్య విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు గూడు చెదిరి, కూడు, గుడ్డతో పాటు గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటే నవ్వుతూ సెల్ఫీలు తీసుకోవసం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయినా ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యాల్సిందిపోయి సెల్ఫీలు తీసుకోవడం.. ఆకలితో ఉన్న వారిని అడ్డంగా దోచుకోవడం మానవత్వానికే మాయని మచ్చగా నిలుస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nepal  selfies  manuments  marchants  india  earth quake  

Other Articles