Ap | Special status | Central govt | Nirmala seetharaman

Central ministre nirmala seetharaman clear that central govt will give special status for ap

ap, special status, central govt, nirmala seetharaman, chandrababu, nda, upa, congress, tamilnadu

Central ministre nirmala seetharaman clear that central govt will give special status for ap. She said that central govt will provide special status for ap but cant tell the time limit.

ప్రత్యేక హోదా ఇవ్వమని అనలేదే.. ఎప్పటికైనా ఇస్తాం: నిర్మలా సీతారామన్

Posted: 04/27/2015 08:38 AM IST
Central ministre nirmala seetharaman clear that central govt will give special status for ap

ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. అయినా ఓ కేంద్ర మంత్రి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తాం కానీ ఎప్పుడు అని మాత్రం చెప్పడానికి లేదు అని అంటున్నారు. ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరు అనుకుంటున్నారా.. కేంద్ర పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్. మాట తప్పం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. కానీ, అందుకు కొంత సమయం పడుతుంది. ఇప్పుడా? ఏడాదికా? రెండేళ్లకా? అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేం అని ఆమె అన్నారు. ఏపికి ప్రత్యేక హొదా కుదరదు అని పార్లమెంట్ లో చెప్పినా కానీ.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని బీజేపీ ఎక్కడా చెప్పలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. వాస్తవంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తమకు ఇబ్బందులు వస్తాయని, తమ రాష్ట్రాలనుంచి పరిశ్రమలు వెళ్లిపోతాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాలు మోకాలడ్డుతున్నాయని  ఆమె చెప్పారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా తమకూ ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడాల్సి ఉంటుందని, ఈ దశలో ఏకంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించలేమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే దీనిపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి ఎంపీలుగా అందరూ కష్టపడుతున్నాం.. కానీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా మాటల కన్నా, ప్రతిపక్షం కాంగ్రెస్ మాటలనే మీడియా ప్రసారం చేస్తోందని అన్నారు.  బీజేపీ కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేశామన్నది చెప్పినా పత్రికలలో ఒక మూల ఓ చిన్న ఐటమ్‌ పడేస్తున్నారు అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు. మొత్తానికి అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు నిర్మలా సీతారామన్ మీడియా మీద మండిపడింది. ప్రత్యేక హోదా సీరియల్ ఇంకా అయిపోలేదని అంటోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  special status  central govt  nirmala seetharaman  chandrababu  nda  upa  congress  tamilnadu  

Other Articles