TDP | TRS | Plenary | Hyderabad | Fire

Tdp leaders fire on trs plenary in hyderabad

mothkupalli, ravula, chandra shekar, kcr, trs, plenary, hyderabad, speaker,

TDP leaders fire on trs plenary in hyderabad TRS leaders did sucessfully the TRS Plenary in hyderabad. TDP leaders comments on that. They said that TRS partys plenary proved that the party only for rich.

టిఆర్ఎస్ టపాసులు.. టిడిపి తూటాలు..?

Posted: 04/25/2015 08:24 AM IST
Tdp leaders fire on trs plenary in hyderabad

టిఆర్ఎస్ నిర్వహించిన ప్లీనరీ సమావేశం హిట్ అయింది. టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్లీనరీ విజయవంతం కావడంపై ఆనందంగా ఉన్నారు. కానీ మరో పక్క తెలుగు దేశం నాయకులు మాత్రం ప్లీనరీపై, టిఆర్ఎస్ పై కారాలు మిరియాలు దంచుతున్నారు. టిఆర్ఎస్ వైట్ కాలర్ ప్లీనరీని నిర్వహించిందని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ ధనవంతుల పార్టీగా మారిందన్న విషయాన్ని ప్లీనరీ స్పష్టం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. 2001 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన కెసిఆర్ తన శాసనసభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త ఒరవడి సృష్టించడం బాగుందని, కానీ అదే కెసిఆర్ ఒరవడి ఇప్పుడు ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, ఈ ప్రాజెక్టును నిలుపుదల చేస్తామని, కాళేశ్వరంగా పేరు మారుస్తున్నట్లు తీర్మానాల్లో పేర్కొన్నారని ఆయన తెలిపారు. గతంలో ఈ ప్రాజెక్టుకు టిఆర్‌ఎస్ నేతలు జాతీయ హోదా తెస్తామని చెప్పి ఇప్పుడు నిలుపుదల చేయడం సిగ్గు చేటని విమర్శించారు.

దళితులను అణచివేస్తూ పేద వర్గాలకు వ్యతిరేకంగా ధనిక వర్గాలకు అనుకూలంగా టిఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించిందని టిడిపి నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి ఇచ్చినందుకా?, రబీ సీజన్‌లో పంటలు సాగు చేయవద్దని చెప్పినందుకా ప్లీనరీ నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి టిఆర్ఎస్ నాయకులు టిపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటుంటే, టిడిపి నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mothkupalli  ravula  chandra shekar  kcr  trs  plenary  hyderabad  speaker  

Other Articles