TRS Party | Hyderabad | Plenary | KCR

Trs party celebrating grandly on its plenary at hyderbad

TRS, Plenary, Hyderbad, kcr, shedule, party,

TRS party celebrating grandly on its plenary at hyderbad. TRS party leaders are arranged all facilities at plenary. The party president kcr, reelected as new president.

కలర్ ఫుల్.. జోష్ ఫుల్ గా టిఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు

Posted: 04/24/2015 09:25 AM IST
Trs party celebrating grandly on its plenary at hyderbad

తెలంగాణ ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ అధికార పార్టీ హోదాలో నేటి నుండి ప్లీనరీ సమావేశాన్ని జరుపుకుంటున్నది. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఈసారి పార్టీ ఆవిర్భావ దినం ఒక పండుగలా చేసుకోవటానికి ‘గులాబీ’ అధినాయకత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అంతకు ముందు పార్టీ ప్లీనరీ సమావేశానికి పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక..టీఆర్‌ఎస్‌ అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాక వచ్చిన తొలి వార్షికోత్సవం కావటంతో భారీగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లలో జాగ్రత్తలు పాటిస్తోంది.  ప్లీనరీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున దాదాపు 36,000 మంది ప్రతినిధులను పార్టీ ఆహ్వానించింది. ప్లీనరీలో పది నెలల పార్టీ పనితీరు, ప్రభుత్వ పాలనను సమీక్షించి, భవిష్యత్తు ప్రణాళికకు రూపకల్పన చేసుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పార్టీ నూతన అధ్యక్షునిగా తిగి ఎన్నికైన కేసీఆర్‌.. ఈ వేదిక నుంచి టిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నారు.
 
ఇదీ ప్లీనరీ షెడ్యూల్‌..
సీఎం కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ప్లీనరీ జరిగే ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం, కేకే తొలి పలుకులతో కార్యక్రమం మొదలవుతుంది. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నికపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నాయిని నర్సింహారెడ్డి ప్రకటన చేస్తారు. నూతన అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు. 12 తీర్మానాల ప్రతిపాదన, ఆమోదంతో ప్లీనరీ ముగుస్తుంది.
 
ఇవీ తీర్మానాలు
1. టీఆర్‌ఎస్‌ వ్యవస్థాగత నిర్మాణం
2. పట్టణాభివృద్ధి-విశ్వ నగరంగా హైదరాబాద్‌
3. ప్రజా సంక్షేమం
4. సాంస్కృతిక పునరుజ్జీవం
5. వ్యవసాయం-నీటిపారుదల-మిషన్‌ కాకతీయ
6. విద్యుత్‌ రంగం
7. మౌలిక వసతుల కల్పన
8. సాగునీటి వ్యవస్థ-పారిశ్రామిక రంగం
 9. వర్తమాన రాజకీయాలు-టీఆర్‌ఎస్‌
 10. తెలంగాణకు హరిత హారం
11. కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలి
12. బలహీన వర్గాల గృహ సముదాయం, గోదావరి పుష్కరాలు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Plenary  Hyderbad  kcr  shedule  party  

Other Articles