Mahabubnagar | Chandrababu | Elections | elangana

Narachandrababu naidu on his party leadres at mahabubnagar meeting

narachandrababu, chandra babu, ap, tdp, TTDP, mahabubnagar, elections,

narachandrababu naidu on his party leadres at mahabubnagar meeting. He said that party will come in power at telangana in 2019 elections.

తమ్ముళ్లూ... మీరు నా బలం

Posted: 04/23/2015 08:15 PM IST
Narachandrababu naidu on his party leadres at mahabubnagar meeting

పార్టీలో కార్యకర్తలే టీడీపీకి బలమని, తెలుగుదేశం పార్టీని ఏ శక్తి అడ్డుకోలేదని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీకి ఇంత బలం ఇచ్చిన కార్యకర్తలకు పాదాభివందనమని ఆయన అన్నారు. గురువారం పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ నాపై ఎంత ఒత్తిడి వచ్చినా రాష్ట్ర విభజనకు పార్టీ తరఫున లేఖ ఇచ్చారని అన్నారు. టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. టీడీపీ రాకముందు తెలంగాణ అభివృద్ధి జరగలేదని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కూడా మేమే అని, హైదరాబాద్‌తోనే తెలంగాణకు మిగులు బడ్జెట్‌ వచ్చిందని అని చంద్రబాబు తెలిపారు.

2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే అని ఆయన అన్నారు. నేతల వలసలను ప్రస్తావించిన చంద్రబాబు ఒక్క నాయకుడు పోతే వందమందిని తయారు చేసే సత్తా టీడీపీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. గురువారం పాలమూరుకు చేరుకున్న చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పసుపుమయం అయింది.
 
రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయని, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నా జీవితంలో పాలమూరు జిల్లాలను మరిచిపోలేనని ఆయన అన్నారు. పాలమూరు కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉన్నానని, పార్టీలో ఒకరిద్దరు నాయకులు పోతే వంద మంది నాయకులను తయారుచేసే శక్తి టీడీడీకి ఉందని ఆయన అన్నారు. ప్రజలు, కార్యకర్తల కోసమే బతుకుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరిస్తామని అయన అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని... పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వేరే పార్టీలు మన నేతలను అరువు తీసుకున్నారని బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తల బాబోగులు చూసుకునే బాధ్యత నాదే అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narachandrababu  chandra babu  ap  tdp  TTDP  mahabubnagar  elections  

Other Articles