aap | Rally | Delhi | Suicide | Parliament

Aap facing new problem on farmer suicide at aap rally

aap, kejriwal, farmer, suicide, jantarmantar

AAP facing new problem on farmer suicide at aap rally. Opposition leaders trying to debate on farmers suicide at parliament. They gave a notice to debate.

రైతు ఆత్మహత్య.. ఆప్ కు తెచ్చింది కొత్త తంటా

Posted: 04/23/2015 10:27 AM IST
Aap facing new problem on farmer suicide at aap rally

ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ర్యాలీ పార్టీని కొత్త వివాదాలకు లాగింది. ఆప్ చేపట్టిన ర్యాలీలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకోవడంపై దుమారం రేగుతోంది. ఆప్ ర్యాలీలో యువరైతు ఆత్మహత్యపై పార్లమెంట్ చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు స్పీకర్ ను కోరాయి. అయితే ఆప్ ర్యాలీలో ఆప్ నేతలు, కార్యకర్తలు చేసిన అతి వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆప్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే రైతు ఆత్మహత్యకు కారణం ఎన్డీయే విధానాలేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆప్ నేతల వైఖరిని తప్పుపట్టారు. ర్యాలీలో భావోద్వేగాలు కలిగేలా ఆప్ నేతలు వ్యవహరించారని అన్నారు. మొత్తానికి ఆప్ ర్యాలీ పార్టీని పార్లమెంట్ లో ఇరుకున పెట్టనుంది. మరి దీనిపై ఆప్ నేతలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో గజేంద్ర అనే యువ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. చెట్టుకు ఉరేసుకోడానికి గజేంద్ర ప్రయత్నించగా, అతడిని గమనించిన ఆప్ వాలంటీర్లు వెంటనే చెట్టు ఎక్కి, అతడిని కిందకు దించారు. గజేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించినా, ప్రయోజనం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ర్యాలీ తలపెట్టి.. ప్రారంభించింది. ఆ ర్యాలీలోనే గజేంద్ర ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతడు రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తాను ఓ రైతు కొడుకునని, రాజస్థాన్లోని నంగల్ ఝాల్వార్ ప్రాంతానికి చెందినవాడినని చెప్పాడు. తన పంట మొత్తం సర్వనాశనం కావడంతో తన తండ్రి ఇంట్లోంచి గెంటేశారని, తనకు ముగ్గురు పిల్లలున్నా.. చేయడానికి పనేమీ లేదని, ఇప్పుడు ఇక ఇంటికి ఎలా వెళ్లాలో మీరే చెప్పాలని ఆ లేఖలో అతడు అన్నాడు. అలా గజేంద్ర ఆత్మహత్య ఆప్ ను ఇరుకున్న పెట్టేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  farmer  suicide  jantarmantar  

Other Articles