TDP | Chandrababu | Mahabubnagar | Tour

Telugudesam party president nara chandrababu naidu tour today in mahabubnagar

telugudesamparty, TTDP, Mahabubnagar, chandrababu, tour, telangana

Telugudesam party president nara chandrababu naidu tour today in mahabubnagar. Mahabubnagar TDP leaders arranging all arrangements at the meeting.

పాలమూరులో చంద్రోదయం.. టిటిడిపికి కొత్త ఉదయం వస్తుందా..?

Posted: 04/23/2015 08:34 AM IST
Telugudesam party president nara chandrababu naidu tour today in mahabubnagar

చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా టిడిపి శ్రేణులు మహబూబ్ నగర్ లో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 40 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా. ఇందుకు ఏర్పాట్లు జరిగాయి. చంద్రబాబుకు ఘనస్వాగతం పలుకుతూ జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా ముఖ్యనేతలు సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ఎంఆర్‌ీ పఎస్‌ చలో మహబూబ్‌నగర్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంఆర్‌పీఎస్‌ నేతల కదలికలపై నిఘా పెంచారు. ఏపీ అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయనందుకు నిరసనగా చంద్రబాబు సభలో ఆందోళనకు దిగాలనిఎంఆర్‌పీఎస్‌ నాయకులు నిర్ణయించారు. దీంతో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆకర్ష్‌కు ప్రతిగా విపక్ష టీడీపీ ఎదురుదాడికి సన్నద్ధమైంది. పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించడంతో పాటు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది.

ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 12.30 గంటలకు మహబూబ్‌ నగర్‌ చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తల స మావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30గంటల నుంచి 7.30 గంటల వరకు నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి పాలమూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఎత్తు తగ్గించి, ముంపు ప్రాంతాల సంఖ్య తగ్గించాలన్న డిమాండ్‌తో జిల్లాకు చెందిన ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళన విజయవంతం కావడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయంతో ఉత్సాహంతో ఉన్న టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా ముఖ్య కార్యకర్తలతో పార్టీ అధినేత సమావేశం నిర్వహించనున్నందున ఇప్పుడున్న లోపాలు సరిదిద్దుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల నాటికి పట్టుసాధించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugudesamparty  TTDP  Mahabubnagar  chandrababu  tour  telangana  

Other Articles