కన్న కోడుకు మంచాన పడితే.. వాడి ఆలన పాలన చూడాల్సిన తల్లి అత్యంత దారుణంగా వ్యవహరించింది. తన కొడుకు సంపాదన లేదని, తన కోడలి చేత వ్యభిచారం చేయించడానికి యత్నించి కటకటాలు లెక్కించింది. తన కొడలు పెళ్లి లో చప్పినంత కట్నం తేలేదని, అందుచేతే వ్యభిచారం చేయాలని ఒత్తడి చేసినట్టు మరీ బరితెగించి చెప్పింది. కొడలిపై ఓ కానిస్టేబుల్ మనసస్సు పడితే తన ఇంటినే వ్యభిచారం కోంపగా మార్చేందుక కూడా సిద్దమైంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కట్నం తక్కువగా ఇచ్చారనే కారణంతో కోడలిపై నిత్యం సూటిపోటి మాటలను అంటూ వేధిస్తున్న అత్త.. 13రోజుల క్రితం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను ఇంటికి తీసుకుని వచ్చింది. డబ్బు వస్తుందనే ఉద్దేశంతో అతని కోరిక తీర్చాలని కోడలిపై ఒత్తిడి తెచ్చింది. అందుకు నిరాకరించిన కోడలు.. కానిస్టేబుల్ ను దూషించడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు అతడ్ని ఇంటికి తీసుకొచ్చిన అత్త, అతడ్ని ఇంట్లోకి పంపించి బయటికి తాళం వేసింది. అప్పుడు కూడా అతని బారి నుంచి బాధితురాలు తప్పించుకుంది. ఆ తర్వాత రెండు రోజులకు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని లేదంటే తన కొడుకును చంపేస్తానని బాధితురాలిని బెదిరింపులకు గురిచేశాడు.
ఈ క్రమంలో ఈ నెల 11న బాధితురాలి కొడుకుకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పిందని.. అతడిని ఆస్పత్రిలో చేర్పించామని, వెంటనే రావాలని సమాచారం అందించడంతో.. అత్తతో కలసి బయలుదేరింది. అయితే అస్పత్రికి బదులు లాడ్జీకి తీసుకెళ్లడంతో అత్తతో గోడవ పడిన కోడలు వెనుదిరుగుతుండగా, అప్పటికే అక్కడ మకాం వేసిన కానిస్టేబుల్ తన గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. వెంటనే తేరుకున్న బాధితులరాలు కానిస్టేబుల్ బారి నుంచి మరోసారి తప్పించుకుని, నేరుగా తన పుట్టింటికి వెళ్లింది. కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పి, తన తల్లి, సోదరుడి సాయంతో ఆమె డిఎస్పీకి ఫిర్యాదు చేసింది. డిఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ అమె అత్తను, అత్యాచారానికి యత్నించిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more