Telangana | Inter | Result | Kadium

Telangana dep cm kadium released inter first year results

telangana, inter, results, kadium, srihari

Telangana dep. cm kadium released inter first year results. In the inter first year 2,39,954 students passed.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదల

Posted: 04/22/2015 11:31 AM IST
Telangana dep cm kadium released inter first year results

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  విడుదల చేశారు. ఈ  ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జనరల్, వొకేషనల్ విద్యార్థులు తమ మార్కులను, గ్రేడ్లను వెబ్సైట్లలో పొందవచ్చు.  మొత్తం 2,39,954  మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  అయితే ఈసారి కూడా ఫలితాల్లో బాలికదే పై చేయి అని కడియం శ్రీహరి ప్రకటించారు. మొత్తం 4,66,448 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. కాగా కాగా ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. click here to see results: http://www.aptsmanabadiresults.in/p/manabadi-ts-inter-1st-year-results-2015.html and also see : http://examresults.ts.nic.in/Inter1GenResult.aspx

ఈ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71శాతంతో మొదటిస్థానంలో ఉండగా, 43శాతంతో నల్గొండ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 25 నుండి జూన్ 1వ తేది వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తమని, ఫీజు గడువు తేది మే1 అని కడియం శ్రీహరి ప్రకటించారు. ఏప్రిల్ 26 నుండి మార్కుల జాబితా తీసుకోవచ్చని తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఏవైనా లోపాలు ఉంటే మే 22 లోగా ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  inter  results  kadium  srihari  

Other Articles