Modi | Civil servents | Speech | Family

Pm narendra modi suggeted civil servents to spend time with family

modi, civil servents, family, files, tentions, delhi, speech, civil servies day

Pm narendra modi suggeted civil servents to spend time with family. By spending time with family all tentions will go away and you wil work more modi said.

బ్యాచిలర్ ప్రధాని.. ఫ్యామిలీ పాఠాలు

Posted: 04/22/2015 09:17 AM IST
Pm narendra modi suggeted civil servents to spend time with family

ప్రధాని నరేంద్ర మోదీ బ్యాచిలర్ గా ఉంటున్నాడు అని అందరికి తెలుసు. అయితే బ్యాచిలర్ లైఫ్ లో ఉన్న మోదీ ఫ్యామిలీకి సమయం కేటాయించాలని, ఎప్పుడూ ఆఫీసు, ఫైళ్లు అని కాకుండా కుటుంబ సభ్యులకు టైం కేటాయించాలని సలహా ఇచ్చారు. ఇంతకీ ఎందు్కు ప్రధాని అన్నారనుకున్నారు.. అలా ఫ్యామిలీతో గడిపిన తర్వాత టెన్షన్ లేకుండా పోతుంది కాబట్టి ఆఫీసులో పని ఫాస్ట్ గా జరిపొతుందని మోదీ ప్లాన్. తొమ్మిదో సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సివిల్‌ సర్వీసు అధికారులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో అధికార యంత్రాంగం విధుల్లో రాజకీయ మధ్యవర్తిత్వం తప్పనిసరని అయితే జోక్యం చేసుకోవడం మాత్రం తగదని పేర్కొన్నారు.  మంత్రులు మౌఖికంగా ఇచ్చే ఆదేశాలను అనుసరించవద్దు. నిజాయతీగా పనిచేయండి. మిమ్మల్ని కాపాడుతానని ప్రధాని హామీ ఇచ్చారు.
 
సివిల్‌ సర్వీసు అధికారులు ఏడాదికొకసారి విద్యార్థులతో సమావేశం కావాలని దిశానిర్దేశం చేశారు. ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబ సభ్యులతో గడపడానికీ సమయం కేటాయించాలని, రోబోటిక్‌ జీవితాన్ని గడపొద్దని అధికారులకు సూచించారు. యాంత్రికంగా జీవించడం మొదలు పెడితే.. దాని ప్రభావం ప్రభుత్వం పైనా  వ్యవస్థపైనా పడుతుందన్నారు. మానవీయతను ఎట్టిపరిస్థితుల్లో కోల్పోరాదన్నారు. మధ్యవర్తిత్వం వహిస్తే పనుల్లో వేగం పెరుగుతుందని మోదీ వివరించారు. సామర్థ్యాన్ని నిర్మించడమే నేడు మనం ఎదుర్కొంటున్న పెద్ద సవాలని ఆయన పేర్కొన్నారు. జవాబుదారీతనం, బాధ్యత, పారదర్శకత అనేవి లేకపోతే సుపరిపాలన అసాధ్యమన్నారు. ఆయన దీనిని ఆర్ట్‌(అకౌంటబిలిటీ, రెస్పాన్స్‌బిలిటీ, ట్రాన్స్‌పరెన్సీ)గా అభివర్ణించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  civil servents  family  files  tentions  delhi  speech  civil servies day  

Other Articles