police raids bursted online sex racketin hyderabad

Cyberabad police raid burst star prostitution racket

prostitution racket, Cyberabad police, SOT team, gachibowli police, star prostitution in hotels, star prostitution in private flats, police raid, hyderabad prostitution, prostitution yadigiri, prostitution ladies, police raid prostitution, police council, yadagirigutta, telangana tirupati, prostitution cases andhra pradesh, telangana updates

cyberabad sot team and gachibowli police jointly raid flats and bursted star prostitution racket cyberabad sot team and gachibowli police jointly raid flats and bursted star prostitution racket in hyderabadin hyderabad

హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ప్రధాన సూత్రదారిని..

Posted: 04/18/2015 09:47 PM IST
Cyberabad police raid burst star prostitution racket

స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠా గుట్టును గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం...  ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) అలియాస్ అలీసాబేగం కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివాసముంటుంది. కొండాపూర్ శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. గత నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా పలు అనుమానాస్పద ప్లాట్‌పై చేసిన దాడుల్లో వ్యభిచారిణులతో పాటు విటులు దోరికారు.

ప్రధాన సూత్రదారి సిమ్రాన్‌తో పాటు డీల్లీకి చెందిన డింపుల్(27), అబ్దుల్ సమద్(42), కరీంనగర్‌కు చెందిన షేక్ యాసిన్(20), షేక్ మోసిన్(20), డ్రైవర్లుగా పనిచేసే ఎండి.షకీల్(23), అబ్దుల్ అజీజ్(23), వైజాగ్ తాళ్లపాలెంకు చెందిన వంట మనిషి సంధ్య(35)లను అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి అసెంట్, ఇండికా కార్లు, 20 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్, బ్యాంక్ పాస్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్‌ అకౌంట్లో రూ.2.50 లక్షలు ఉన్నాయని సీఐ తెలిపారు. బ్యాంక్‌లోని డబ్బును కోర్టుకు అందజేస్తామన్నారు.  ఫ్లాట్ యజమానికి నోటీస్ జారీ చేస్తామని చెప్పారు. అతని వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఫ్లాట్ సీజ్ చేస్తామని సీఐ రమేశ్ కుమార్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitution racket  Cyberabad police  SOT team  

Other Articles

Today on Telugu Wishesh