Videogame | Candycrush | Doctors | Warn

Video games in mobiles may get health problems to you

Videogame, candy crush, california, gamelovers, mussals, doctors

Video games in mobiles may get health problems to you. The scientists giving warning on gamelovers to be ware. In california a person got mussals problem. He is palyed candy crush game for few years.

క్యాండీ క్రష్.. మోగిస్తోంది డేంజర్ బెల్స్

Posted: 04/17/2015 03:12 PM IST
Video games in mobiles may get health problems to you

స్మార్ట్ ఫోన్స్, వీడియో గేమ్స్ ఈ రెండింటికి విడదీయలేని అనుబంధం ఉంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక వీడియో గేమ్స్‌ కు క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ టైం కేటాయించి మరీ వీడియో గేమ్స్‌ ను ఆడేస్తున్నారు. ఈ క్రేజ్‌ ను బాగా గుర్తించిన వీడియో గేమ్స్‌ కంపెనీలు ఫ్రీగా డౌన్‌ లోడ్‌ చేసుకునే వీలు కల్పించడంతో ఇక తమ ఫేవరేట్‌ గేమ్స్‌ ను మొబైల్లో తెగ ఆడేస్తున్నారు గేమ్‌ లవర్స్. దీంతో పలు ఆరోగ్యసమస్యలు తలెత్తున్నాయి. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముఖ్యంగా క్యాండీ క్రష్‌ గేమ్‌ తో ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. క్యాండీ క్రష్‌ గేమ్‌‌ ను పిచ్చిగా ఆడితే వేళ్లకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయట. ఎక్కువగా వేళ్లపై ఒత్తిడి పడటంతో ఆ కండరాలు దెబ్బతింటున్నాయట. ఫలితంగా ఏదైనా వస్తువును కూడా పట్టుకోలేని స్థితికి వచ్చేస్తున్నారట.

కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి ఆపకుండా ఈ గేమ్‌ ను ఆడుతుండటంతో ఆయన బొటన వేళ్లకు సంబంధించిన కండరాలు దెబ్బతిన్నాయట. విషయం తెలుసుకున్న డాక్టర్లు ఆశ్చర్యపోయారట. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో అతనికి సర్జీరీ చేశారట. కానీ ఇప్పటికీ ఏదైనా రాయాలన్నా కూడా అతను ఇబ్బంది పడుతున్నాడట. ఇలా వేలికి సంబంధించిన కండరాల సమస్యలే కాదు కళ్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతోందట. అదే పనిగా స్క్రీన్‌‌ పై చూస్తూ ఆడుతుండటంతో కంటి సమస్యలు తలెత్తుతున్నాయట. అదీ గాకుండా మెదడుపై కూడా తీవ్ర ఒత్తిడి ఏర్పడి మానసిక సమస్యలతో బాధపడుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో గేమ్ అనే కాదు... ఏ వీడియో గేమ్‌ నైనా ఎక్కువగా ఆడటం మంచిదికాదని డాక్టర్లు సూచిస్తున్నారు. సరదాగా తప్పించి వ్యసనంగా మారితే వీడియో గేమ్స్‌ వల్ల లైఫ్‌ కు రిస్క్‌ తప్పదని హెచ్చరిస్తున్నారు.

 

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Videogame  candy crush  california  gamelovers  mussals  doctors  

Other Articles