Adveni | Posters | Gandhinagar

Lal krishna advani missing posters in gandhinagar

Lalkrishna adveni, BJP, Congress, missing, posters

lal krishna advani missing posters in gandhinagar. Posters with the photograph of senior Bharatiya Janata Party leader Lal Krishna Advani emerged in Gandhinagar on Tuesday, claiming that their Member of Parliament (MP) was 'missing'.

ఓహో.. అప్పుడు రాహుల్.. ఇప్పుడు అడ్వానీ 'మిస్సింగ్'

Posted: 04/15/2015 12:14 PM IST
Lal krishna advani missing posters in gandhinagar

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు రాహుల్ గాంధీ సెలవుపై వెళ్లిపోవడం దేశ రాజకీయాల్లో సంచలనాన్నే రేపింది. రాహుల్ గాంధీ కనిపించడం లేదు.. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషకం ఇస్తామని అమేధీ వీధుల్లో బిజెపి నాయకులు పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్ల వివాదం కూడా వార్తలకెక్కింది. అయితే తాజాగా రాహుల్ బాటలోనే బిజెపి సీనియర్ నాయకుడి నడుస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.అసలు విషయం ఏంటో తెలియాలంటూ ఈ స్టొరీ చదవాల్సిందే..

బిజెపి సీనియర్ నాయకుడు, బిజెపి పార్టీ స్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అడ్వానీ కనిపించడం లేదంటూ తాజాగా గాంధీనగర్ లో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ముందు అభివృద్ది అదీ.. ఇదీ అంటూ మాటలు చెప్పిన నాయలకులు ప్రస్తుతం కనిపించకుండా పోయారని స్థానికులు అంటున్నారు. ఎన్నికలు జరిగి ఇంత కాలం అయినా తమగోడు వినడానికి కనీసం ఒక్కసారి కూడా రాలేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రాహుల్ బాబు కనిపించకుండా పోవడాన్ని బాగానే ప్రచారం చేసిన బిజెపి మరి అడ్వానీ పోస్టర్లను ఎలా వెనకేసుకొస్తుందో చూడాలి. మరి బిజెపి చేసిన దానికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు అడ్వానీ మిస్సింగ్ కు మరింత ప్రచారం కల్పిస్తారో లేదా రాహుల్ బాబు రాలేదు కదా ఇప్పుడు ఎందుకు అని ఊరుకుంటారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalkrishna adveni  BJP  Congress  missing  posters  

Other Articles