Congress Assam MLA Rumi Nath arrested | Car Theft Case

Congress assam mla rumi nath arrested in car theft racket case

Mla ruminath, ruminath theft case, rumi nath car theft case, rumi nath controversy, mla rumi nath husband, mla rumi nath car theft, theif anil chouhan, jacky jakeer, mla rumi nath husband case

Congress Assam MLA Rumi Nath arrested in car theft racket case : The Guwahati police arrested Congress leader Rumi Nath in connection with the pan-India auto theft racket on Tuesday morning. Her arrest comes after the Guwahati high court rejected her

కార్ల దొంగతో మహిళా MLAకి సంబంధం.. అరెస్ట్ చేసిన పోలీసులు?

Posted: 04/14/2015 12:36 PM IST
Congress assam mla rumi nath arrested in car theft racket case

ఇటీవలే దేశవ్యాప్తంగా కార్ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజురోజుకు దొంగతనానికి గురవుతున్న కార్ల బాధితుల సంఖ్య మరింత పెచ్చుమీరిపోతున్న సమయంలో నిందితులను ఆటకట్టించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే.. ఈ విచారణలో భాగంగానే కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్ల దొంగతనాల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూమీనాథ్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. అసోం, మహారాష్ట్ర, న్యూఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో అతి సునాయాసంగా కార్లను-ఆటోలను దొంగిలించడంలో అనిల్ చౌహాన్ బాగానే పేరుగడించాడు. ఆ దొంగలించిన వాహనాలను తన పేరుతో రిజిష్టర్ చేసుకొని, తప్పుడు రికార్డులతో అమ్ముకోవడం అతనికి అలవాటు! ఈ నేపథ్యంలో అతనికి అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించేందుకు కారు పాస్లు మంజూరు చేశారు. ఈ పాస్ లను మంజూరు చేయడంలో MLA రూమీ సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఆమె అతని దగ్గర ఒక విలువైన కారును కొన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఈ దొంగతనాల కేసులో ఈమె హస్తం వుందన్న అనుమానంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

కార్లను దొంగతనం చేయడంలో నిందితులకు సహకరించారని గతకొన్నాళ్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రుమీనాథ్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు కూడా! అయితే గత శుక్రవారం గౌహతి హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించడంతో అరెస్టు తప్పలేదు. అటు ఈ సంచలన కేసులో రూమీనాథ్ రెండో భర్త జాకీ జకీర్, ఆమె వ్యక్తిగత భద్రతా అధికారి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పుడు ఆమెను కూడా అరెస్టు చేశామని, బుధవారం నాడు కోర్టులో ప్రవేశపెడతామని ఏసీపీ లాల్ బారువా చెప్పారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా అసోం కాంగ్రెస్ పార్టీ రూమీ నాథ్ కు షోకాజ్ నోటీసు ఇచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles