ghmc emergency teams alerts due to heavy rains

Heavy rain forecast in hyderabad

heavy rain forecast in hyderabad, ghmc emergency teams alerts due to heavy rains, GHMC, emergency teams, heavy rains, rain, several areas, hyderabad, GHMC commissioner, somesh kumar,

heavy rain forecast in hyderabad, ghmc emergency teams alerts due to heavy rains

హైదరాబాద్ లో మరో మూడు రోజుల పాటు వర్ష సూచన

Posted: 04/12/2015 04:57 PM IST
Heavy rain forecast in hyderabad

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ టీమ్స్ను అప్రమత్తం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ వెల్లడించారు. రహదారులపై నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 040 -21111111 కు ఫోన్ చేయాలని ఆయన నగరవాసులకు సూచించారు. శనివారం సాయంత్రం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తర్ నుంచి భారీ వర్షాలు పడ్డాయి.  దాంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైనాయి.

ఈ నేపథ్యంలో గ్రేటర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులతో సోమేష్కుమారు సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో ఎమర్జెన్సీ జట్లను అప్రమత్తం చేశామని చెప్పారు. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచన చేయడంతో.. నగరంలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురవడం ప్రారంభమైంది. సిటీలోని హయత్ నగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, వనస్థలిపురం, మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, బాలానగర్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది.

ఆదివారం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వానలు కురిశాయి.  వరణుడి దెబ్బకు జిల్లాలో మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. రాయలసీమ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా రాయపూర్ వరకు ఉపరితల వర్తనం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతోనే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వారు చెప్పారు. శనివారం రాయలసీమలో సగటు ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలుగా నమోదయ్యాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  emergency teams  heavy rains  rain  several areas  hyderabad  

Other Articles