Thamilar vidudalai kalijam party | Tamil | Chandrababu

Thamilar vidudalai kalijam party warn to ap cm chandrababu and andhra people

Tamil, Thamilar vidudalai kalijam party , attack, ap, cm babu, chandrababu, tamilnadu, chennai

Thamilar vidudalai kalijam party warn to ap cm chandrababu and andhra people. They said that they will attack on ap cm chandrababu naidu if he will come to chennai. In tamilnadu who residenting telugu people also will atttacked.

చంద్రబాబు పై .. ఆంధ్రులపైనా దాడులు చేస్తాం: తమిళర్ విడుదలై కజగం పార్టీ హెచ్చరిక

Posted: 04/10/2015 10:50 AM IST
Thamilar vidudalai kalijam party warn to ap cm chandrababu and andhra people

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్ మంటలు తీవ్ర మవుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నిప్పురాజేసిన ఎన్ కౌంటర్ సెగలు.. ఎంతకీ తగ్గడం లేదు. అయితే తమిళనేతల మాటలు కోటలు దాటుతున్నాయి. హద్దులు మీరి మాట్లాడుతున్న తమిళనేతల మాటలతో వివాదం మరింత ముదురుతోంది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి తమిళనేత వైగో ఇచ్చిన పిలుపు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా మరో నేత ఏకంగా ఏపి సిఎంపై దాడికి దిగుతామని హెచ్చరించారు. అంతటితో ఊరుకోకుండా తమిళనాడు లో నివసిస్తున్న తెలుగు వారిపై కూడా దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు చెన్నై వస్తే భౌతిక దాడులు తప్పవనీ, త్వరలోనే ఇక్కడ నివసిస్తున్న ఆంధ్రులపై, వారి ఆస్తులపై దాడులు చేస్తామని తమిళర్ విడుదలై కజగం పార్టీ నేతలు హెచ్చరించారు. మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనపై తమిళనాట ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. బూటకపు ఎన్‌కౌంటర్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరువళ్లూరులో  రాస్తారోకో నిర్వహించారు.
 
ఇక ఎన్ కౌంటర్ కు కారణం అంటూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మలకు చెప్పుల దండలు వెయ్యడం, దిష్టి బొమ్మల దహనాల పర్వం కొనసాగుతోంది. అయితే తాజాగా తమిళర్ విడుదలై కజగం పార్టీ నేతలు చేసిన ప్రకటన ఎలాంటి దాడులకు దారి తీస్తుందో అని తమిళనాడులోని తెలుగు వారు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఓ రాష్ట్రానికి సిఎం కాబట్టి ఆయనకు రక్షణ ఉంటుంది కానీ మామూలు ప్రజలం మాకేం రక్షణ ఉంటుందని కూడా తమిళనాడులో ఉంటున్న తెలుగు వారు ప్రశ్నిస్తున్నారు. మరి తెలుగు వారిపై దాడులు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil  Thamilar vidudalai kalijam party  attack  ap  cm babu  chandrababu  tamilnadu  chennai  

Other Articles