madras high court | seshachalam encounter smuglers

Madras high court orders to stop funeral of seshachalam encounter smuglers

madras high court, seshachalam encounter, tirupati encounter, sandalwood crime, seshachalam smuglers, tirupati encounter controversy, tamilnadu protests, tamilnadu protest encounter, chandrababu naidu, supreme court of india

madras high court orders to stop Funeral of seshachalam encounter smuglers : The Madras High court orders to tamilnadu government to stop Funeral of seshachalam encounter smuglers. Court said that make post mortem of their bodies another time and tell the facts behind this incident.

శేషాచలం ఎన్ కౌంటర్ మృతుల అంత్యక్రియలు ఆపండి : హైకోర్టు

Posted: 04/09/2015 09:04 PM IST
Madras high court orders to stop funeral of seshachalam encounter smuglers

తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం ఎర్రచందనం దొంగలను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపిన విషయం తెలిసిందే! అయితే.. ఈ ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే తమిళనాట తీవ్ర నిరసనలు పెల్లుబికాయి. తమిళనాడు సీఎం దీనిమీద సమగ్రంగా విచారణ జరిపించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. మరోవైపు నిరసనకారులు ఏపీ నుంచి అటు వెళ్లే వాహనాలపై దాడికి పాల్పడుతున్నారు. అలాగే హెరిటేష్ ఫ్రెష్ లపై దాడికి పాల్పడుతున్నారు. మొత్తానికి ఈ విషయం రచ్చరచ్చగా మారింది.

ఇదిలావుండగా.. పోలీసులు జరిపిన ఈ ఎన్ కౌంటర్ లో తన భర్త మృతి చెందడంపై అనుమానాలున్నాయని, వాస్తవాలు వెలికి తీసేందుకు మరోసారి పోస్టు మార్టం నిర్వహించారని ఓ బాధితురాలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఎన్ కౌంటర్ లో మృతిచెందిన కూలీలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించి, వాస్తవాలు బాధితులకు తెలియజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం వరకు మృతదేహాలకు అంత్యక్రియలు జరపొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆరుగురి మృతదేహాలకు రేపటి (శుక్రవారం) వరకు అంత్యక్రియలు జరగకుండా ఆగిపోనున్నాయి.

మరోవైపు.. ఈ ఎన్ కౌంటర్ వ్యవహారం సుప్రింకోర్టు వరకు వెళ్లింది. తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి అనే న్యాయవాది సుప్రింకోర్టులో ప్రస్తావన వేశారు. బాబు, డిజిపి కుమ్మక్కై ఈ ఎన్ కౌంటర్ చేయించారని.. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలిపినట్లు కృష్ణమూర్తి తెలిపారు. గతంలో కొన్ని నకిలీ ఎన్ కౌంటర్ల విషయంలో సుప్రింకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో శేషాచలం అడవులలో జరిగిన ఎన్ కౌంటర్ కు ప్రాముఖ్యత ఏర్పడింది. మరి.. కోర్టు ఈ సారి ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందో చూడాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madras high court  seshachalam encounter  sandalwood smuglers encounter  

Other Articles